పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన ఇద్దరు వారియర్స్ వీరే: అపూర్వ చిత్రాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం ట్విట్టర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పెరియార్‌ల ఫోటోలను పోస్ట్ చేశారు. తనకు ఇష్టమైన ఇద్దరు వారియర్స్ వీరే అంటూ ఆ ఫోటోలు పెట్టారు.

  Dr B R Ambedkar : Tributes Paid To Great Person, Watch

  మోడీ-బాబులను డిఫెన్స్‌లో పడేసిన పవన్ కళ్యాణ్: చెప్పింది వింటే సరే లేదంటే అంతే!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఫోటోను పెట్టారు. తనకు ఇష్టమైన ఇద్దరు వీరులు.. హీరోలు వీరేనని, వీరిద్దరూ కలసి ఉన్న అపూర్వ చిత్రం లండన్‌లో తనకు దొరికిందని పవన్ కళ్యామ్ పేర్కొన్నారు.

  పవన్ కళ్యాణ్ షేర్ చేసిన అపూర్వ చిత్రం

  పవన్ కళ్యాణ్ షేర్ చేసిన అపూర్వ చిత్రం

  ఈ అపూర్వ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామిలు కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్న ఈ చిత్రం తనకు లండన్‌లోని అంబేద్కర్ హౌస్‌లో కనిపించగా, దాని కాపీని తీసుకున్నానని పవన్ తెలిపారు.

   తుది శ్వాస వరకు పోరాడారు

  తుది శ్వాస వరకు పోరాడారు

  వీరిద్దరూ సమాజంలో అసమానతలను తొలగించాలన్న ఉద్దేశంతో తమ తుది శ్వాస వరకూ పోరాడారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆ తర్వాత పవన్ కళ్యామ్ మరో ఫోటో కూడా పోస్ట్ చేశారు,.

   వారిని తీక్షణంగా చూస్తూ పవన్ కళ్యాణ్

  వారిని తీక్షణంగా చూస్తూ పవన్ కళ్యాణ్

  తొలి ఫోటోను పెరియార్, అంబేడ్కర్‌లు కలిసి సరదాగా నవ్వుతూ ఉన్న ఫోటోను పెట్టిన పవన్.. ఆ తర్వాత తాను ఆ ఫోటోను చూస్తున్న ఇమేజ్‌ని పోస్ట్ చేసారు. వారిద్దరు సరదాగా నవ్వుతున్న ఫోటోను పవన్ కళ్యాణ్ తీక్షణంగా చూస్తూ అందులో ఉన్నారు.

   పార్టీపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్

  పార్టీపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్ ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన జనసేన కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఇప్పుడు వరుసగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ప్రారంభించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'Two of my favourite Warriors Sri Ambedkar & Sri Periyar who fought against social inequality & who stood firmly for social justice, till their last breath.(Photo taken by me in Ambedkar’s house,London)' Pawan Kalyan tweeted.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి