ఉద్యోగమంటూ యువతికి ఫోన్: రూ.2.25లక్షలు కాజేశారు

హైదరాబాద్: నైజీరియన్ల మోసాకలు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అమాయక ప్రజలను లక్ష్యం చేసుకుని వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఖతార్‌లో రైల్వే ఉద్యోగమంటూ ఓ యువతిని మోసం చేసిన ఇద్దరు నైజీరియన్లను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన మైఖెల్‌ జేమ్స్‌(30), ఉమేది వలంటైన్‌ చిగోజీ(30) చదువు నిమిత్తం ఢిల్లీలో ఉంటున్నారు. ఉద్యోగ వెబ్‌సైట్ల నుంచి నిరుద్యోగుల ఫోన్‌ నంబర్లు, ఇతర డేటా సేకరించారు.

ఉద్యోగాల పేరుతో ఫోన్లు చేసి డబ్బులు కాజేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో ఉద్యోగవేటలో ఉన్న శంషాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఫోన్‌ చేసి ఖతార్‌ రైల్వేలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం ఉందని, నెలకు వేతనం 7900 పౌండ్లని నమ్మించారు. ఇందుకు రూ.25వేల వీసా ఛార్జీలు, ప్రాసెస్‌ఫీజు కింద రూ.2.25లక్షలు కావాలంటూ.. తమ ఖాతాలో ఆ డబ్బును వేయించుకున్నారు.

ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవడం, ఉద్యోగం రాకపోవడంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఢిల్లీకి వెళ్లి ఇద్దరు నిందతులను అరెస్టు చేశారు. వారి నుంచి 52 సిమ్‌కార్డులు, మూడు ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్‌ ఫోన్‌లు, 2 డేటాకార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరారు.

మైకేల్ జేమ్స్

మైకేల్ జేమ్స్

నైజీరియాకు చెందిన మైఖెల్‌ జేమ్స్‌(30), ఉమేది వాలంటైన్‌ చిగోజీ(30) చదువు నిమిత్తం ఢిల్లీలో ఉంటున్నారు. ఉద్యోగ వెబ్‌సైట్ల నుంచి నిరుద్యోగుల ఫోన్‌ నంబర్లు, ఇతర డేటా సేకరించారు. ఉద్యోగాల పేరుతో ఫోన్లు చేసి డబ్బులు కాజేయడం ప్రారంభించారు.

ఉమేది వాలెంటైన్

ఉమేది వాలెంటైన్

ఈ ఏడాది జనవరిలో ఉద్యోగవేటలో ఉన్న శంషాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఫోన్‌ చేసి ఖతార్‌ రైల్వేలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం ఉందని, నెలకు వేతనం 7900 పౌండ్లని నమ్మించారు. ఇందుకు రూ.25వేల వీసా ఛార్జీలు, ప్రాసెస్‌ఫీజు కింద రూ.2.25లక్షలు కావాలంటూ.. తమ ఖాతాలో ఆ డబ్బును వేయించుకున్నారు.

గంజాయితో పట్టుబడ్డారు

గంజాయితో పట్టుబడ్డారు

ధూల్‌పేటలో గంజాయి వ్యాపారం చేస్తున్న ఇరవైకి పైగా కుటుంబాలను గుర్తించామన్నారు. ఈ దందాపై ‘గంజాయిపై సమరం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు.

గంజాయితో పట్టుబడ్డారు

గంజాయితో పట్టుబడ్డారు

శనివారం లోయర్‌ ధూల్‌పేటలోని జుమ్మేరాత్‌బజార్‌, జిన్సీచౌరాహీ, యతీంఖానా ప్రాంతాల్లో దాడులు చేపట్టి అయిదుగురిని అరెస్టు చేయడమేగాక 11.2 కిలోల గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

గంజాయితో పట్టుబడ్డారు

గంజాయితో పట్టుబడ్డారు

మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్‌ శాఖ సీఐలు సైదిరెడ్డి, జియావుద్దీన్‌, ఎస్సైలు యాదయ్య, జస్వంత్‌నాయుడు, గోపాల్‌, విష్ణుమూర్తి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+