యూఎన్ ఉద్యోగినంటూ అందమైన అమ్మాయి ఎఫ్‌బీ రిక్వెస్ట్: రూ.1.5కోట్ల టోకరా!

హైదరాబాద్‌ నగరంలో నైజీరియన్ల మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసి మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్‌: నగరంలో నైజీరియన్ల మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసి మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, అందమైన అమ్మాయి ఫొటోతో ఫేస్‌బుక్‌లో యువకులను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానంటూ వారి నుంచి డబ్బులు గుంజుతున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఉద్యోగ వేటలో హైదరాబాద్‌ చేరాడు. కోరుకున్న కొలువు సంపాదించాడు. కాగా, 2015లో ఫేస్‌బుక్‌లో మెర్సీ ఫ్రాన్సిస్‌ అనే అందమైన యువతి పేరుతో అతనికి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గంటల కొద్దీ చాటింగ్‌. ఆ యువతి తాను యునైటెడ్‌ నేషన్స్‌(యూఎన్‌) లో ఇరాక్‌ ప్రతినిధిగా పనిచేస్తున్నట్టు చెప్పింది.

తన వద్ద 5.6 బిలియన్‌ డాలర్ల డబ్బు ఉందని, ప్రస్తుతం అవి రెడ్‌క్రాస్‌కు చెందిన విభాగంలో డిపాజిట్‌ చేసినట్టు వివరించింది. అంత పెద్దమొత్తంలో డబ్బును అక్కడ ఉంచటం ఇష్టంలేదని చెప్పింది. ఆ డబ్బును ఇండియాకు పంపి వ్యాపారం చేద్దామంటూ నమ్మకం కలిగించింది.

Two Nigerians held for fraud in Delhi

పెళ్లి చేసుకున్న తరువాత వచ్చే సంపాదనతో సంతోషంగా ఉండవచ్చంటూ తన అభిప్రాయాన్ని అతనితో చెప్పింది. అంత పెద్దమొత్తంలో ఇండియాకు చేరే విదేశీకరెన్సీకి పన్నులు చెల్లించాలంటూ ముందుగానే సూచించింది. దీంతో అతడు నమ్మాడు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి వచ్చిన డాలర్లు ఢిల్లీలోని కస్టమ్స్‌ శాఖ వద్ద ఉన్నాయంటూ ఫ్రాన్సిస్‌ నుంచి ఫోన్‌కాల్‌.

విలియమ్స్‌ అనే అధికారికి రూ.8లక్షలు చెల్లించ మంటూ ఆమె సమాచారం ఇచ్చింది. రిజర్వ్‌బ్యాంక్‌ ఇండియా నుంచి అనుమతి కోసం మరో రూ.10లక్షలు, యాంటీ టెర్రరిస్ట్‌ ట్యాక్సులంటూ అతని వద్ద మరో రూ.10 లక్షలు వసూలు చేశారు. దశల వారీగా కోటి రూపాయలను వివిధ మార్గాల్లో దండుకున్నారు. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కోసం రూ.13.5లక్షలు చెల్లించి డాలర్లు తీసుకెళ్లవచ్చంటూ ప్రతిపాదన తెచ్చారు.

అప్పటికే పెద్దనోట్ల రద్దుతో కరెన్సీ కష్టాలు వేధిస్తున్నాయి. ఆ సమయంలో బాధితుడు ఆ నగదు తీసుకుని ఢిల్లీకి వెళ్లి మార్షల్‌ అనే వ్యక్తికి ఇచ్చాడు. అప్పటికే మాయగాళ్లు సిద్ధంచేసిన నకిలీ డాలర్ల కట్టలను బాధితుడికి చూపించారు. ఆర్‌బీఐ నుంచి అనుమతి వచ్చిందని ఓ కార్పొరేట్‌ బ్యాంకులో జమ చేయబోతున్నట్లు నమ్మకం కలిగించాడు.

కెమికల్‌ పేరుతో మరోసారి

కొద్దిరోజుల తరువాత యువకుడికి మరో ఫోన్‌కాల్‌. డాలర్లు తీసుకెళ్లేందుకు మార్గం సుగమం అయినట్టు సమాచారం. ఆశగా అక్కడకు వెళ్లిన అతడికి డాలర్లు చూపించారు. డాలర్‌పై ఉన్న బ్లాక్‌ను తొలగించేందుకు ప్రత్యేకమైన కెమికల్‌ ఉందంటూ మార్షల్‌ అనే వ్యక్తి బురిడీ కొట్టించాడు. కెమికల్‌ డబ్బా ఖరీదు రూ.16 లక్షలు చెల్లించి డాలర్లు తీసుకెళ్లవచ్చని తేల్చిచెప్పారు. ఇప్పటికే పలువురి వద్ద అప్పులు చేసి చెల్లించిన ఆ యువకుడు తిరిగి హైదరాబాద్‌ వచ్చాడు. మొత్తం రూ.1.50 కోట్లు పోగొట్టుకున్న బాధితుడు చివరికి ఇదేదో మోసంలా ఉందని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆపరేషన్‌ ఢిల్లీ గ్యాంగ్‌

సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి.ఎం.ప్రసాద్‌ మరో 8 మంది పోలీసులతో కలిసి ఢిల్లీ చేరారు. ముందస్తు పథకం ప్రకారం బాధితుడు రూ.16 లక్షలు ఇచ్చేందుకు ఢిల్లీ వస్తున్నట్టు మార్షల్‌ అనే నైజీరియన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరగానే డబ్బు తీసుకునేందుకు వచ్చిన మార్షల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సూత్రధారి విలియమ్స్‌ను పట్టుకునేందుకు అతడి ఇంటికి చేరారు. అదే సమయానికి ఇంటి వద్దకు వచ్చిన విలియమ్స్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సైబర్‌క్రైం పోలీసులను వెనక్కి నెట్టేసి పారిపోయాడు. ఢిల్లీ వీధుల్లో పరుగెత్తుతూ తప్పించుకుని ఓ ఇంట్లోకి దూరాడు. అతికష్టంమ్మీద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

ఇద్దరమ్మాయిలతో సహజీవనం

పోలీసులకు పట్టుబడిన విలియమ్స్‌కు అమెరికా, యూకే, కెనడా తదితర దేశాల్లో ఉన్న నైజీరియన్లతో మంచి సంబంధాలున్నాయి. వారి సహకారంతోనే అక్కడి ఫోన్‌నెంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీకి ఉపయోగి స్తుంటాడు. ఢిల్లీ చేరిన ఇతడు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులతో సహజీవనం సాగిస్తు న్నాడు. వారిద్దరూ అక్కాచెల్లెళ్లుగా పోలీసులకు తెలిపాడు. వారిలో ఒక యువతి ద్వారా నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరచి.. అమెరికా దేశపు అమ్మాయి ఫొటో ద్వారా చాటింగ్‌ నాటకం ఆడించాడు. బాధితుడితో ఆ యువతి ద్వారానే మాట్లాడించి బాధితుడికి టోపీ పెట్టారు. కాగా, ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+