దారుణం: ఇన్పెక్షన్ తో కోఠి ఆసుపత్రిలో ఇద్దరు మృతి, విచారణకు ప్రభుత్వ ఆదేశం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కోఠి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది.. డెలీవరి కోసం వచ్చిన ఇద్దరు మహిళలు మృతిచెందారు. దీంతో ఇవాళ జరగాల్సిన 12 శస్త్రచికిత్సలను నిలిపివేశారు. అత్సవసర చికిత్సల కోసం నలుగురిని ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

కోఠి ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. గురువారం అర్థరాత్రి డెలీవరి కోసం నిర్వహించిన శస్త్రచికిత్సల సందర్భంగా ఇన్పెక్షన్ చోటుచేసుకొంది. ఈ ఇన్పెక్షన్ కారణంగా ఇద్దరు మహిళలు మరణించారని బాధితుల బంధువులు చెబుతున్నారు.

అయితే ఆపరేషన్ థియేటర్ లోనే ఇన్పెక్షన్ సంబవించిందని వైధ్యాధికారులు గుర్తించారు.ఈ మేరకు ఆపరేషన్ థియేటర్ ను మాసివేశారు.

two patients died postoperative in Koti hospital

అయితే ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ స్పందించింది. 12 ఆపరేషన్లు నిర్వహిస్తే అందులో నలుగురికి ఇన్పెక్షన్ సోకినట్టుగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే దీనికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది.

మరోవైపు వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చనిపోయారని బాధితుల బంధువులు చెబుతున్నారు.ఈ మేరకు వారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు కోఠి ఆసుపత్రి ఎదుట బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసింది.ఈ ఇన్పెక్షన్ కారణంగా జయమ్మ, శారద అనే ఇద్దరు మరణించారు. మరో వైపు నలుగురు పేషేంట్లను ఇతర ఆసుపత్రులకు తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
two patients died postoperative in Koti hospital on Friday. victim relatives protest at hospital premises, government ordered to enquiry on this incident.
Please Wait while comments are loading...