హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు కరుడు గట్టిన నేరగాళ్ల అరెస్టు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాదులోని నాచారం మేడిపల్లి పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడు గట్టిన నేరగాళ్లను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు నగలను, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వారు నాలుగు చైన్ స్నాచింగ్, రెండు వాహనాల చోరీ కేసుల్లో నిందితులను పోలీసులు చెప్పారు. హైదరాబాదులోని గోల్కొండ ప్రాంతంలోని హకీంపేటకు చెందిన ఏదులకుంటి నవీన్ (21), గోల్నాకాలోని న్యూ తులసి రామ్‌నగర్‌కు చెందిన కరిపె రాజు అలియాస్ రాజు అలియాస్ దుర్గ (27) పోలీసుల చేతికి చిక్కారు.

మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లు, వాహనాల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఇన్‌స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ విస్తృతమైన తనిఖీలు, గస్టీ నిర్వహించడంతో వారు చిక్కారు. వాహనాల తనిఖీలు కూడా విస్తృతంగా నిర్వహించారు.

బోడుప్పల్ వద్ద అరెస్టు

బోడుప్పల్ వద్ద అరెస్టు

అనుమానంగా సంచరిస్తుండడంతో పోలీసులు వారిద్దరిని బోడుప్పల్ వద్ద శుక్రవారంనాడు అదుపులోకి తీసుకున్నారు. వారిని మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. దాంతో వారి నేరాలు బయటపడ్డాయి.

నాలుగు చైన్ స్నాచింగ్‌లు

నాలుగు చైన్ స్నాచింగ్‌లు

మల్కాజిగిరి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక నేరానికి, మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఐదు నేరాలకు వారు పాల్పడినట్లు విచారణలో తేలింది.

వాహనాల చోరీ

వాహనాల చోరీ

వారిద్దరు నాలుగు చైన్ స్నాచింగ్‌లకు, రెండు వాహనాల చోరీలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్టు చేశారు.

బంగారు నగలు స్వాధీనం

బంగారు నగలు స్వాధీనం

ఇద్దరు నేరగాళ్ల నుంచి పది తులాల బంగారాన్ని, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 4.30 లక్షలు ఉంటుందని అంచనా.

నాలుగు కేసుల్లో..

నాలుగు కేసుల్లో..

మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఏదులకంటి నవీన్ రెండు చైన్ స్నాచింగ్, రెండు వాహన చోరీల్లో పాలు పంచుకున్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. కరిపె రాజుతో కలిసి ఒక చైన్ స్నాచింగ్ చోరీలో పాల్గొన్నాడు.

English summary
The I.D party of Medipally P.S., have apprehended the duo accused on 14.08.2015 near Boduppal, when the duo were found moving under suspicious circumstances. The apprehended accused were subsequently brought to Medipally Police Station, where they were interrogated upon. It is with their interrogation, the following (4) cases of chain snatchings and (2) cases of vehicle thefts could be detected, the details of which are listed below.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X