రెండు పులుల భీకరపోరు: ఓ ఆడపులి మృతి
ఆదిలాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో రెండు పులులు మధ్య ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో ఓ పులి మరణించింది. సుమారు రెండేళ్ల వయస్సున్న 2 పులులు ఆవాసం కోసం కొట్లాడగా.. ఓ ఆడపులి తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ ఉన్నతాధికారులు పోస్టుమార్టం నిర్వహించి.. నమూనాలను ప్రయోగశాలకు పంపించారు.
ఈ ఘటన జరిగి మూడునాలుగు రోజులు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. పశువైద్యాధికారుల సమక్షంలో పులి మృతదేహాన్ని ఖననం చేసినట్లు వెల్లడించారు. కాగా, స్థానికంగా పులలు సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పులి దాడిలో మహిళ మృతి
తెలంగాణ-మహారాష్ట్ర సరిద్దు గ్రామమైన చింతలపేట్‌లో పెద్దపులి దాడిలో మహిళ మృతి చెందింది. ఖానాపూర్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరీ పరిధిలో చింతల్ పేట గ్రామంలో ఆదివారం పత్తి తీసేందుకు చేనులోకి వెళ్లిన మహిళపై పెద్దపులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని స్థానికులు చెప్పారు. మృతి చెందిన మహిళ చింతల్‌పేట్ కు చెందిన సుష్మా(50)గా గుర్తించారు. సుష్మా గ్రమంలో కిరాణా షాపు నిర్వహిస్తూ కూలి పనులకు వెళ్లేదని స్థానికులు తెలిపారు. పులి బారి నుంచి కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications