పరువు తీస్తున్నాడని స్నేహితుడి హత్య(పిక్చర్స్)
హైదరాబాద్: మద్యానికి బానిసై పది మందిలో పరువు తీస్తున్నాడని తమ స్నేహితుడ్నే ఇద్దరు యువకులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన నగరంలోని చందానగర్‌లో చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన నయీం దారుణహత్య కేసును మూడు రోజుల్లోనే చందానగర్ పోలీసులు ఛేదించారు. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డిసిపి ఎం శ్రీనివాస్‌రావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసు, ఎస్సైలు వేణు, టంగుటూరి శ్రీనివాస్, సైదులు వివరాలు వెల్లడించారు.
శేరిలింగంపల్లి బాపునగర్‌కు చెందిన సయ్యద్ నయీం(20) జులాయిగా తిరుగుతుండేవాడు. మద్యానికి బానిసై తరచు ఇతరులతో గొడవ పడుతుండేవాడు. అదేవిధంగా స్థానికంగా గోపీనగర్ చెందిన గటుపల్లి కిరణ్‌కుమార్ (24) నిరుద్యోగి, సుదర్శన్‌గర్‌కు చెందిన కురువ నవ కిషోర్ లోథా అనే సంస్థలో గేమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. కిరణ్‌కుమార్, నవ కిషోర్, నయీం ముగ్గురు పాత మిత్రులు. కానీ, నయీం మాత్రం మద్యం సేవించినప్పుడు కిరణ్, కిషోర్‌ను అసభ్యంగా దూషించేవాడు. డబ్బులివ్వమని బలవంతపెట్టేవాడు. పదిమందిలోనూ అలాగే వ్యవహరిస్తుండే వాడు.
దీంతో విసుగుచెందిన వీరు నయీంను హతమారుద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఒక వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ముగ్గురు గోపి చెరువు వెనుకాల ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే పథకం ప్రకారం.. ఆయుధాలను సిద్ధం చేసుకున్న కిరణ్, కిషోర్ నయీంకు ఎక్కువ మద్యం తాగించి కత్తితో మెడ నరికారు. పక్కటెముకల్లో, కడుపులో కత్తితో పొడిచారు. అక్కడి నుంచి పరారయ్యారు.
కాగా, నయీంను హతమార్చే క్రమంలో కిరణ్, కిషోర్‌ల దుస్తులకు రక్తం అంటింది. దీంతో ఒకరు ఒంటిమీదున్న టీ షర్టు మార్చి అక్కడే పడేశారు. ఇంకొకరి దుస్తులను ఆనవాలు దొరక్కుండా కాల్చేశారు. ఆ టీ షర్ట్, కాలిపోగా మిగిలిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ కోణంలో విచారణ వేగవంతం చేశారు. అలాగే, నయీం ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కూపీ లాగారు. ఈ మేరకు కిరణ్, కిషోర్‌ను విచారించగా అసలు విషయం బయటపెట్టారు. వారిపై కేసు నమొదు చేసుకుని రిమాండుకు తరలించారు.

స్నేహితుడి హత్య
మద్యానికి బానిసై పది మందిలో పరువు తీస్తున్నాడని తమ స్నేహితుడ్నే ఇద్దరు యువకులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన నగరంలోని చందానగర్‌లో చోటు చేసుకుంది.

స్నేహితుడి హత్య
చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన నయీం దారుణహత్య కేసును మూడు రోజుల్లోనే చందానగర్ పోలీసులు ఛేదించారు.

స్నేహితుడి హత్య
పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డిసిపి ఎం శ్రీనివాస్‌రావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసు, ఎస్సైలు వేణు, టంగుటూరి శ్రీనివాస్, సైదులు వివరాలు వెల్లడించారు.

స్నేహితుడి హత్య
నయీంను చంపేందుకు నిందితులు ఉపయోగించిన మారణాయుధాలు.












Click it and Unblock the Notifications