ఇద్దరు యువతులపై అత్యాచారయత్నం: ఎంపిటీసీ కుమారుడితో సహా మిత్రుడి అరెస్టు
నిజామాబాద్: ఇద్దరు బాలికలకు మత్తు మందు ఇచ్చి అపహరించి, ఆ తర్వాత అత్యాచారానికి యత్నించిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో స్థానిక ఎంపీటీసీ తనయుడితో పాటు మరో యువకుడు పట్టుబడ్డాడు.
రామారెడ్డికి చెందిన ఇద్దరు 8వ తరగతి చదువుతున్న బాలికలు బుధవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళుతుండగా, గ్రామానికి చెందిన ఎంపీటీసీ నామాల యాదగిరి తనయుడు కిరణ్ కుమార్, అతడి స్నేహితుడు నితీష్ కుమార్‌లు కలిసి బాలికలకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశారు.

వారిని ధర్మారం చెరువు సమీపంలోని పౌల్ట్రీఫారం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. అయితే, మత్తులో ఉన్న బాలికలు స్పృహలోకి వచ్చి కేకలు వేయడంతో పక్కనే ఉన్న స్థానికులు వచ్చి బాలికలను రక్షించారు. ఇద్దరినీ బైక్‌తో సహా పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.
బాలికలను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులపై కిడ్నాప్‌తో పాటు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో ఒకరు ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తూ సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన కిరణ్‌కుమార్ అని గుర్తించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications