యూఏఈ జైళ్లలోని తెలంగాణ ఖైదీలను విడుదల చేయండి: రాయబారికి కేటీఆర్ విజ్ఞప్తి
దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యూఏఈ ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్మాలి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ ఖైదీల వివరాలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్‌కు చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు.
అయితే యూఏఈ చట్టాల(షిరియా) ప్రకారం రూ. 15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు గతంలోనే స్వయంగా తాను నేపాల్ కు వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. షరియా చట్టంలోని ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని.. ఈ మేరకు బాధితుడి కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే భారత దౌత్య కార్యాలయంతోపాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి కూడా ఈ విషయంలో అనేకసార్లు తాము స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే, యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని.. ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తాను చెప్పిన వివరాలను ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలని కోరారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో.. దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించిలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్.. యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేక చొరవ తీసుకుని దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణవాసులను
క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు భారతీయ ప్రవాసీలను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు.
ఇది ఇలావుండగా, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ ప్రశంసలు కురిపించారు.
అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్న మౌలిక వసతులతో భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న ఆశాభావం అబ్దుల్ నసీర్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేటీఆర్ ఆయనకు వివరించారు. ప్రపంచంలో దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. యూఏఈ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ కోరగా.. ఇందుకు నసీర్ సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications