చంద్రబాబూ! ఇదీ పరిస్థితి, అర్థం చేసుకోండి: టీడీపీకి ఉమామాధవరెడ్డి రాజీనామా
హైదరాబాద్: మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఆమె గురువారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.
Recommended Video

తన కొడుకు సందీప్ రెడ్డితో కలిసి ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళవారం వార్తలు వచ్చాయి. అంతలోనే ఆమె బుధవారం తన రాజీనామా లేఖను అధినేతకు పంపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

గత్యంతరం లేకే పార్టీని వీడుతున్నా
ఉమా మాధవ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలను ఆమె అధినేతకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకే తాను టీడీపీని వీడుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

మాకు పార్టీలో, ప్రభుత్వంలో గౌరవం ఇచ్చారు
ప్రస్తుత పరిస్థితుల్లో తమ పరిస్థితి అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నానని ఉమా మాధవ రెడ్డి అన్నారు. తెలంగాణలోని పరిస్థితులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని కూడా పేర్కొన్నారని తెలుస్తోంది. నాకు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. తమకు దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉందని చెప్పారు.

టీఆర్ఎస్‌లోకి వెళ్తారని
కాగా, ఉమా మాధవ రెడ్డి, ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీని వీడుతారని, తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మంగళవారం తొలుత సందీప్ రెడ్డి 14వ తేదీన కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఉమ కూడా చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరుసటి రోజే ఆమె రాజీనామా చేశారు.

టిక్కెట్ పైన హామీ
కాగా, ఉమా మాధవ రెడ్డికి భువనగిరి టిక్కెట్ విషయంలో తెరాస నుంచి హామీ వచ్చినందువల్లే అధికార పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె లేదా ఆమె తనయుడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications