వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారా.. లేదా..? రాష్ట్ర కాంగ్రెస్‍లో అస్సలు ఏం జరుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళం కొనసాగుతోంది. నేతలు ఎవరి వారే అన్న తీరుగా వ్యవహారిస్తున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రపై అస్పష్టత నెలకొంది. బుధవారం బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. హాత్‌సే హాత్‌ జోడో'చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది.

భద్రాచలం

భద్రాచలం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 26న భద్రాచలంలోని రాములవారి సన్నిధి నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 99 రూరల్‌ నియోజకవర్గాల్లో కొనసాగనున్న పాదయాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

 సీనియర్ నేతలు

సీనియర్ నేతలు

అయితే రేవంత్ పాదయాత్రకు పలువురు సీనియర్ నేతలు అడ్డు తగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాదయాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదని కొందరు నేతలు చెబుతున్నారు. దీంతో రేవంత్ పాదయాత్రపై అస్పష్టత నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పాదయాత్ర కోసం రేవంత్‌
ప్లాన్ చేస్తున్నా.. ఏదో ఒక అవాంతరంతో వాయిదా పడుతోంది.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో చర్చించారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించారు.నేతలంతా కలిసి పనిచేయాలని కోరారు. అయినా కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేనట్లుగా కనిపిస్తోంది.

English summary
Confusion continues in Telangana Congress. The leaders are acting like they belong. There is uncertainty over TPCC president Revanth Reddy's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X