హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్ ఏర్‌పోర్ట్‌లో 40లక్షల బంగారం, చెన్నైలో మరుగుదొడ్డి వద్ద 9.5 కిలోల బంగారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/చెన్నై: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న దంపతుల వద్ద దాదాపు రూ.50 లక్షల విలువ చేసే 1,750 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Unclaimed gold worth Rs.50 lakh found at Hyderabad airport

దుబాయ్ నుంచి ఇతియాస్ సంస్థకు చెందిన విమానంలో హైదరాబాదుకు చందిన భార్యాభర్తలు కుమార్తెతో కలిసి విమానాశ్రయానికి వచ్చారు.

ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా, దంపతుల లగేజీలో బంగారం ఉన్నట్లు తెలిసింది. బ్యాగులు తెరిచి చూడగా బంగారు రింగులు, బిస్కెట్లు లభించాయి. కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని ప్రశ్నిస్తున్నారు.

విమానం మరుగుదొడ్డి వద్ద 9.5 కేజీల బంగారం

సింగపూర్‌ నుంచి మంగళవారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఒక విమానం మరుగుదొడ్డి వద్ద 9.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు.

Unclaimed gold worth Rs.50 lakh found at Hyderabad airport

ఈ విమానం సింగపూర్‌ నుంచి తిరుచ్చి మీదుగా చెన్నై వచ్చింది. ఈ విమానంలో భారీగా బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో, అధికారులు తనిఖీ చేశారు. ఏడుగురిపై అనుమానం రావడంతో వారిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి విచారించారు.

వారి వద్ద నాలుగు కేజీల పసిడి బయటపడింది. దీనిని తాము చట్టబద్ధంగానే తీసుకొచ్చామని చెబుతూ ఆ ప్రయాణికులు ధ్రువపత్రాలు చూపించగా, అధికారులు వారిని వదిలేశారు. ప్రయాణికులందరూ వెళ్లాక విమానంలో తనిఖీ చేశారు. మరుగుదొడ్డి వద్ద తొమ్మిదిన్నర కేజీల బంగారు బిస్కెట్లు ఉన్న ప్లాస్టిక్‌ సంచిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

English summary
Unclaimed gold worth Rs.50 lakh found at Hyderabad airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X