లోటస్ పాండ్ వద్ద అపస్మారక స్థితిలో అర్ధనగ్నంగా యువతి
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. నగరంలోని జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్ వద్ద రోడ్డుపై ఓ యువతి అపస్మారకస్థితిలో అర్ధనగ్నంగా పడివుంది. ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారకస్థితిలో ఉన్న యువతికి దుస్తులు వేసి.. 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆ యువతిపై అత్యాచారం చేసి రోడ్డుపై పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి వయస్సు 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో దారుణ ఘటన జరిగింది. అత్తా, కోడలిపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్‌మెన్, ఇతర పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున నలుగురు దుండగులు బైక్‌లపై వచ్చారు.
నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నసంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడినవారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఘటనపై ఆయన ఎస్పీతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications