రాత్రి 11గం.: లేడీస్ హాస్టల్ వద్ద ఊహించని ఘటన.. భయంతో స్థానికులు..

Subscribe to Oneindia Telugu

వరంగల్: ప్రైవేటు కళాశాలల హాస్టళ్లు జైళ్లను తలపిస్తాయన్నది అందరికీ తెలిసిందే. అత్యవసరమైతే తప్ప 'ఔట్ గోయింగ్'కు అనుమతించరు. అందుకే చాలావరకు ప్రైవేట్ కాలేజీల హాస్టల్లో ఉండే విద్యార్థులు.. రాత్రిపూట గోడలు దూకుతుంటారు.

ఎవరి కంట పడకుండా రాత్రిపూట బయటకెళ్లి బ్రెడ్ ఆమ్లెట్, బిర్యానీ వంటివి తిని వస్తుంటారు. వరంగల్, హన్మకొండలోని ఇంటర్ ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు చాలాసార్లు ఇలా బయటకెళ్లి పట్టుబడ్డారు. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.

unexpected incident after man brings biryani packets for hostel friend

హన్మకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటున్న స్నేహితురాలి కోసం ఆమె స్నేహితుడు రాత్రి పూట బిర్యానీ తీసుకొచ్చాడు. అప్పటికీ టైమ్ 11గం. అవుతోంది. ఆ సమయంలో అయితే ఎవరూ ఉండరనుకుని వచ్చాడు. మరో స్నేహితుడిని కూడా వెంటపెట్టుకుని వచ్చాడు.

మూడో అంతస్తులో ఉన్న స్నేహితురాలికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంట తీసుకొచ్చిన బిర్యానీ ప్యాకెట్స్, బిస్కెట్స్ హాస్టల్ మూడో అంతస్తులోకి ఎలా పంపించాలో వారికి అర్థం కాలేదు. దీంతో ముడివేసిన చున్నీలను సదరు విద్యార్థిని కిందకు పంపించింది.

బిర్యానీ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ ఆ చున్నీకి కట్టాక.. పైకి లాగుతున్న క్రమంలో అనుకోకుండా అది కరెంట్ వైర్లకు తాకింది. పెద్దగా మంటలు రావడంతో స్థానికులంతా ఇళ్లలో నుంచి బయటకొచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఆ ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రమాదమేమి జరగకపోవడంతో మందలించి వారిని వదిలపెట్టారు. అలాగే హాస్టల్ విద్యార్థినులను సైతం హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An unexpected incident took place after a man brought biryani packets for hostel friend in Hanamkonda

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి