చిరంజీవి సీరియస్-క్రిష్ణంరాజు కు లేఖ:వారిపై చర్యలు తప్పవు-ఎన్నికలపైనా క్లారిటీ..!!
"మా " లో జరుగుతున్న పరిణామాల పైన మెగాస్టార్ సీరియస్ అయ్యారు. ఎన్నికల పేరుతో ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోవటం పైన ఆగ్రహ వ్యక్తం చేసారు. దీనికి కారకులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ "మా " క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాసారు. "మా " ఎన్నికల వివాదం ప్రారంభమైన నాటి నుంచి చిరంజీవి తన అభిప్రాయం ఎక్కడా ఓపెన్ కాలేదు. అదే విధంగా ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం అయిదుగురు పోటీ పడుతున్నారు.

ఇప్పటి దాకా చిరంజీవి నిరీక్షణ..
తాను పోటీకి దిగుతున్న విషయం ప్రకటనకు ముందే ప్రకాశ్ రాజ్ మర్యాద పూర్వకంగా చిరంజీవిని కలిసారు. ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చిన సమయంలో..నాగబాబు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇక, పోటీలో మంచు విష్ణు-జీవిత-హేమ తో పాటుగా నర్సింహారావు బరిలో నిలిచారు. కానీ, ఎన్నికలు ఎప్పుడు జరిగేదీ స్పష్టత రాలేదు. ఈలోగా పోటీలో ఉన్న వారు..వారికి మద్దతిస్తున్న వారు ప్రత్యక్షంగా-పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పోటీ లేకుండా ఏకగ్రీవం పైనా చర్చ సాగింది. కానీ, అది సరైనది కాదంటూ నాగబాబు లాంటి వారు తేల్చి చెప్పారు.

ముదురుతున్న వివాదాలతో...
విష్ణు మాత్రం తాను పెద్దలు కూర్చొని ఏకగ్రీవమని నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు. ఇక, తాజాగా హేమ ఒక ఆడియో మెసేజ్ సర్క్యులేట్ చేసారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. నరేష్ "మా " అధ్యక్షుడు అయిన సమయం నుంచి ఖర్చు పెట్టటం మినహా... రూపాయి కూడా తేలేదంటూ ఆ ఆడియో మెసేజ్ లో ఆరోపించారు. దీనికి తాజాగా నరేష్ తో పాటుగా జీవిత వివరణ ఇచ్చారు. తాను చేసిన ఖర్చు..వచ్చిన ఆదాయం గురించి వివరించారు. ఇక, ఈ నెల 22న జనరల్ బాడీ సమావేశంలో ఎన్నికలే ప్రధాన అంశంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ కీలక సమయంలో క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా ఉన్న క్రిష్ణం రాజు పాత్ర కీలకంగా మారింది.

చర్యలు తీసుకోండి...ఎన్నికలు జరపండి..
ఆయన సైతం ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ సభ్యుల నుంచి అభిప్రాయ సేకరణ చేసారు. ఇక, ఈ వివాదం మరింతగా ముదురుతున్న సమయంలో..చిరంజీవి ముందుకు వచ్చారు. క్రమశిక్షణాసంఘం అధ్యక్షుడు క్రిష్ణం రాజుకు లేఖ రాసారు. "మా " ఎన్నికలు వెంటనే జరపాలంటూ చిరంజీవి లేఖ లో కోరారు. మా ప్రతిష్ట దెబ్బ తీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ క్రిష్ణంరాజుకు సూచించారు. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేసారు. అదే విధంగా.. సభ్యుల బహిరంగ ప్రకటనలతో మా ప్రతిష్ఠ మసక బారుతోందని లేఖలో పేర్కొన్నారు. "మా " ఎన్నికల వ్యవహారంలో చిరంజీవి లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

చిరు ఎంట్రీతో సీన్ మారిపోతుందా...
అసలు ఎన్నికలు జరుగుతాయా..లేదా..ఎప్పడు నిర్వహిస్తారనే చర్చ - రచ్చ కొంత కాలంగా కొనసాగుతూ ఉంది. అయితే, టాలీవుడ్ లోని పెద్దలు కూర్చొని ఈ సమస్యను పరిష్కరించాలనే వాదన తెర మీదకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ పైన ముందుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం పైన కొన్ని సందేహాలు ఉండటంతో..జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు చిరంజీవి లేఖతో ఈ అంశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. చిరంజీవి లేఖ చర్యలు తీసుకొనేందుకు వీలుగా క్రిష్ణంరాజుకు నైతికంగా బలం ఇస్తుంది. దీంతో..సెప్టెంబర్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

దాసరి పాత్ర చిరు పోషిస్తారా...
చిరంజీవి తన లేఖలో "మా " ప్రతిష్ఠ మసకబారుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరైతే "మా "ప్రతిష్ట దెబ్బ తీస్తున్నారో వారి పైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో..క్రమశిక్షణా సంఘం ముందుగా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. "మా " లో జరగుతున్న వ్యవహారాలు తెలుగు సినీ పరిశ్రమ లో సంబంధాల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో నాడు పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి దాసరి నారాయణ రావు చొరవ తీసుకొని ఏ విధంగా సమస్యలు పరిష్కరించారో, అదే విధంగా వ్యవహరించే వారు కావాలని కోరుకున్నారు. ఇప్పటి దాకా మౌనంగా పరిణామాలను గమనిస్తూ వచ్చిన చిరంజీవి...ఇప్పుడు అదే తరహాలో కఠినమైన సూచనలు చేస్తూనే..సమస్య పరిష్కారం దిశగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కోరారు. దీని పైన ఇప్పుడు ఎటువంటి రియాక్షన్స్ వస్తాయనేది చూడాలి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications