ఎవరితోనూ పొత్తులు ఉండవు - తేల్చేసిన హోంమంత్రి అమిత్ షా..!!
బీజేపీ కేంద్ర నాయకత్వం దక్షిణాదిన తమ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో దక్షిణాదిన కర్ణాటక - తెలంగాణ ఉన్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా తెలంగాణలో హ్యాట్రిక్ సాధించాలి..కర్ణాటకలో బలం చాటాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. దీనికి కౌంటర్ గా తెలంగాణలో అధికారమే లక్ష్యమంటూ బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కర్ణాటక - తెలంగాణలో బీజేపీ ముఖ్య నేతలు మోహరించారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో బీజేపీ బూత్‌స్థాయి విజయసంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సమయంలో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు.

పొత్తులు ఉండవని తేల్చిన షా
కర్ణాటక దక్షిణాదిలో బీజేపీకి గేట్ వే గా షా అభివర్ణించారు. కర్ణాటకలో 2023లో జరిగే శాసనసభ ఎన్నికలు దక్షిణాదిన బీజేపీ విజయ యాత్రకు నాంది పలకనున్నాయని ధీమా వ్యక్తం చేసారు. కర్ణాటకలోని మొత్తం 224 నియోజకవర్గాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని..150కి పైగా స్థానాలు గెలుచుకోవటం ఖాయమని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు..తరువాత ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ - జేడీఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలుగా అభివర్ణించారు. దేశభక్తుల పార్టీ కావాలో, దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే పార్టీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
ఇటు..బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, తెలంగాణలో బీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా ఎన్నికల యుద్దం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ ఎవరితో కలుస్తుందనేది ఆసక్తిని పెంచుతోంది. ఏపీలో అధికారం కోసం వ్యూహాలు అమలు చేస్తున్న చంద్రబాబు బీజేపీతో పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ కీలకంగా భావిస్తున్న తెలంగాణలో మద్దతిచ్చేందుకు సిద్దమయ్యారు. తెలంగాణలో తమ బలం చాటుకొనేందుకు సభలు నిర్వహిస్తున్నారు. కానీ, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తు ఛాన్స్ లేదని ప్రకటించింది. బీజేపీ ముఖ్య నేతలకు తెలంగాణ పార్టీ నేతలు పొత్తులు వద్దని సూచన చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

టీడీపీతో పొత్తు పై తేల్చేస్తారా
టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో తేల్చి చెప్పారు. 2018లో కాంగ్రెస్ - టీడీపీ పొత్తు కారణంగా హస్తం పార్టీకి ఎలాంటి నష్టం జరిగిందో తనకు తెలుసని అదే సమావేశంలో మాజీ ఎంపీ విజయశాంతి వివరించారు. అటు ఏపీలో జనసేన - బీజేపీతో కలిసి 2014 తరహాలో మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయాలనేది టీడీపీ ఆలోచన. ఇప్పటికీ పవన్ కల్యాణ్ పొత్తు పైన క్లారిటీ ఇవ్వటం లేదు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా..రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. బలం లేని రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలనేది బీజేపీ నేతల తాజా వ్యూహం. దీంతో, ఇప్పుడు ఏపీ- తెలంగాణ రాష్ట్రాల్లో పొత్తుల అంశంపైన బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications