Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై బండి సంజయ్ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై కేంద్ర, రాష్ట్ర అధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం సమీక్ష చేపట్టారు. భారత్ నుంచి వెళ్లిపోయి పాకిస్థాన్, చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై అధికారులతో చర్చించారు. మార్చిలోపు ఆస్తుల లెక్కలు తేల్చాలని కేంద్రమంత్రి ఆదేశించారు.

హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారు.

Union Minister Bandi Sanjay reviews enemy properties in Telangana

తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై వివరాలను అడిగి తెలుసుకున్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ముఖ్యంగా కొత్వాల్‌గూడ, మియాపూర్‌ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్‌పై పురోగతి ఏంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సర్వే నంబర్ల వారీగా పురోగతిని వివరించారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు.

ఇది ఇలావుండగా, ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని.. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ ప్రధాని మోడీ కులంపై వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందన్నారు బండి సంజయ్.

ఎందుకంటే.. 1994లో గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోడీ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. . ఈ విషయాన్ని రేవంత్ మర్చిపోయారని మండిపడ్డారు. మోడీ కులంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు? ఆయన మతం ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన కులం, మతం కూడా సీఎంకి తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తాత ఫీరోజ్ జహంగీర్ అని అన్నారు.

హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుందున్నారు బండి సంజయ్. ఇప్పుడు ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలనుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా 10 జన్‌పథ్ నుంచి ప్రారంభించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంత దృష్టి మరలించాలని ప్రయత్నించినా.. అది పనిచేయదన్నారు. ఇప్పటికే బీజేపీ తరపున తమ నిర్ణయం చెప్పామన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని.. అలాంటి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+