Ponnam Prabhakar: బీజేపీ సామాన్యుడి నడ్డి విరుస్తోంది.. బండిపై పొన్నం ఫైర్..!

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పొన్నం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ చెప్పులు మేసే గుజరాత్ గులాములు మీరంటూ విమర్శించారు.హామీలు ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు తేవడంలో బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్ సాధించిందని ఆరోపించారు. సామాన్యుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తామని హామీ ఇవ్వలేదా అని ప్రశ్నించారు.

రైతులకు ప్రతి నెల పింఛన్, పేదలకు ఉచిత విద్యుత్, రెండు కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలు ఏ ఒక్కటన్నా అమలు చేశారా అని నిలదీశారు. బీజేపీ హామీల గురించి చిన్న బాబును అడిగినా చెబుతారని పోన్నం అన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రూ.150 లక్షల కోట్ల అప్పులు దేశానికి తీరని గుదిబండగా మారాయని అన్నారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకే 11 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయని గుర్తు చేశారు. 10 ఏళ్లలో దేశానికి చేసింది శూన్యమని అన్నారు.

Union Minister Bandi Sanjay was countered by Minister Ponnam Prabhakar

సామాన్యుడి నడ్డి విరవడంలో బీజేపీ ప్రభుత్వం ముందుందని ఆరోపించారు. ఆడబిడ్డల ప్రసూతి ప్రయోజనాల్లో కోత, విద్యార్థుల స్కాలర్షిప్ లలో కోత, వయోవృద్ధుల రైలు ప్రయాణ రాయితీలకు కోత, రేషన్ కార్డుల్లో కోత, ఎరువుల సబ్సిడీలో కోత, గ్యాస్ సబ్సిడీలో కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత, ఫసల్ బీమా లో కోత, సెస్ ల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వాతలతో సామ్యాడు బతుకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ 10 నెలల ప్రజా ప్రభుత్వం పై మాట్లాడే హక్కు బండి సంజయ్ కి లేదన్నారు.

మీకు అవకాశం ఉంటే.. తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా చూడాలన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడాలన్నారు. కరీంనగర్ కు అభివృద్ధి కృషి చేయాలని హితవు పలికారు. దేశం మొత్తానికి కుల గణన దేశానికి దిక్సూచి అన్నారు. త్వరలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ప్రతి అంశం పై మాట్లాడుకుందామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+