Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కామారెడ్డి జిల్లాలో రెండోరోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన; కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ ప్లాన్!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందించిన సహకారాన్ని తెలియజేయడం కోసం, తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టడం కోసం బిజెపి 'పార్లమెంట్ ప్రవాస్ యోజన'లో భాగంగా కేంద్ర మంత్రులను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కామారెడ్డిలో నిర్మలా సీతారామన్ రెండోరోజు పర్యటన

కామారెడ్డిలో నిర్మలా సీతారామన్ రెండోరోజు పర్యటన

ఇక తాజాగా నేడు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కామారెడ్డి జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన పర్యటనను సాగించనున్నారు. బిక్నూర్ లో రేషన్ షాప్ ను నిర్మల సీతారామన్ సందర్శించనున్నారు. అలాగే కోటగిరి పీహెచ్సీలో వ్యాక్సినేషన్ సెంటర్ ను నిర్మల సీతారామన్ సందర్శిస్తారు.

తొలినాడే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్

తొలినాడే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్

ఇక ఇప్పటికే తొలిరోజు పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్ దేశ రాజకీయాలు తర్వాత ముందు రాష్ట్రంపై ఫోకస్ చేయాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు.

అలాగే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్ లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏవిధంగా మార్చారో నిర్మల సీతారామన్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే పుట్టిన బిడ్డ మీద కూడా లక్ష రూపాయల అప్పు ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని నిర్మల సీతారామన్ తెలంగాణ ప్రజలకు తెలియజేశారు.

ప్రవాస్ యోజనలో తెలంగాణా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు

ప్రవాస్ యోజనలో తెలంగాణా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి వరదలై పారిందని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఇక తాజాగా రెండో రోజు పర్యటన సందర్భంగా నిర్మల సీతారామన్ తెలంగాణ ప్రభుత్వాన్ని మరింతగా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతుంది. దిలా ఉంటే ఇప్పటికే 'ప్రవాస్ యోజన'లో భాగంగా ఆగస్టు 29, 30 తేదీల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి (సహకార) బీఎల్ వర్మ పర్యటించారు.

పార్లమెంటు ప్రభాస్ యోజనలో భాగంగా హైదరాబాద్ పార్లమెంటుకు జ్యోతిరాదిత్య సింధియా బిజెపి ఇన్చార్జిగా వ్యవహరించి ఆయన పర్యటన చేశారు. అప్పుడు కూడా ఆయన తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్ర మంత్రుల వ్యాఖ్యలతో తెలంగాణాలో రాజకీయ ప్రాధాన్యత

కేంద్ర మంత్రుల వ్యాఖ్యలతో తెలంగాణాలో రాజకీయ ప్రాధాన్యత

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల్లోనూ పర్యటనలు చెయ్యాలని, క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను, కేంద్రం అందిస్తున్న సంక్షేమాన్ని తీసుకువెళ్లాలని, ఇదే సమయంలో తెలంగాణ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనను టార్గెట్ చేయాలని భావిస్తున్న క్రమంలోనే రాష్ట్రానికి కేంద్ర మంత్రుల రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+