హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమెన్స్ హాస్టల్లోకి అగంతకుడు, వదిలేసిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లోకి నలుగురు వ్యక్తులు రావడంతో.. వారిలో ఒకరిని పట్టుకొని పోలీసులకు పట్టిచ్చారు. అయితే, అతను జారుకోవడంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు చెందిన వారు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఖైరతాబాద్ మార్కెట్లో ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. గత పదిహేను రోజులుగా పక్కనే ఉన్న పాఠశాల ద్వారా అగంతకులు హాస్టల్ మీదకు చేరుకొని యువతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హాస్టల్లోని యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌ను సందర్శించి నిఘా పెంచుతామని పోలీసులు చెప్పారు.

Unknown person into Women's hostel

అయితే, శనివారం రాత్రి నలుగురు అగంతకులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. వెంటనే యువతులు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చారు. అప్పటికి ముగ్గురు పారిపోయారు. ఒకరిని పట్టుకొని తీసుకు వెళ్లారు. ఉదయం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని హాస్టల్ విద్యార్థినులకు సూచించారు.

ఉదయం హాస్టల్ నుండి వార్డెన్, పలువురు యువతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా వారు పట్టించిన వ్యక్తి జాడలేదు. విషయం తెలిసిన మహిళా సంఘాలు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అతడిని చూపేదాకా వెళ్లేది లేదని అక్కడే ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

English summary
Unknown person into Women's hostel in Hyderabad on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X