హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: దళిత నేత ఇంట్లో యూపీ డిప్యూటీ సీఎం భోజనం, హారతులు పట్టారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో జులై 2,3 తేదీల్లో జరగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు, అగ్రనేతలు వస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య అంబర్‌పేట నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పలువురు పార్టీ నేతలను కలిశారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ అధిష్టానం కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగానే కేశవ ప్రసాద్ మౌర్య ముందుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గతంలో ప్రాతినిథ్యం వహించిన అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అశోక్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా సమావేశాలను నిర్వహించారు.

 UP Deputy CM Kesav Prasad mourya had lunch in a house of dalith bjp leader.

బర్కత్‌పురాలోని నగర కార్యాలయంలో అంబర్‌పేట నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి నేతలతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు నేతలు ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి అండగా ఉండాలన్నారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు కన్నె ఉమా రమేశ్ యాదవ్, బీ పద్మ వెంకట్ రెడ్డి, అమృత, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లోని దళిత నాయకుడు అజయ్ కుమార్ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం మౌర్యకు మంగళహారులు పట్టి స్వాగతం పలికారు. మంచి ఆతిథ్యం ఇచ్చిన అజయ్ కుటుంబసభ్యులకు మౌర్య ధన్యవాదాలు తెలిపారు.

English summary
UP Deputy CM Kesav Prasad mourya had lunch in a house of dalith bjp leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X