హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు పిల్లలు, ఆరేళ్ల సహజీవనం: పెళ్లికి నో చెప్పిందని కాల్చేశాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెళ్లికి అంగీకరించలేదని ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా హత్య చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బోడుప్పల్ సీతారాం కాలనీకి చెందిన ముప్పైయేళ్ల షానుకు ఇద్దరు పిల్లలు. ఎనిమిదేళ్ల క్రితం భర్తతో వివాదం కారణంగా తండ్రి వద్ద ఉంటోంది. దేవేందర్ నగర్‌లో ఉంటూ పేయింటింగ్ పని చేస్తున్న యూపీకి చెందిన రాకేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోమని అతను అడిగాడు. అమె నిరాకరించింది. పెళ్లి కోసం ఆమెపై ఒత్తిడి చేశాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పింది. గత నెల 28వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి ఆమెపై పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తీసుకెళ్లిన కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

హైదరాబాద్‌లో సాఫ్టువేర్ ఉద్యోగి ఆత్మహత్య: ప్రేమించిన యువతికి ఐలవ్యూ అని పంపి..హైదరాబాద్‌లో సాఫ్టువేర్ ఉద్యోగి ఆత్మహత్య: ప్రేమించిన యువతికి ఐలవ్యూ అని పంపి..

 UP youth arrested in Hyderabad for killing widow

ఇరువురు ఆరేళ్ల పాటు సహజీవనం చేశారు. ఇప్పుడు పెళ్లి వద్దని చెప్పిందని కిరోసిన్ పోసి నిప్పు అంటించి యూపీలోని సొంతూరికి పారిపోయాడు. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు ఆ తర్వాత హత్యకేసుగా నమోదు చేశారు. తన కుమార్తె మరణంపై సందేహాలు ఉన్నాయని తండ్రి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాఫ్తు జరిపారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

 UP youth arrested in Hyderabad for killing widow

రాకేష్ వయస్సు ఇరవై అయిదు. అతను ఏడేళ్లుగా దేవేందర్ నగర్‌లో ఉంటున్నారు. షాను ఓ కంపెనీలో ఉద్యోగం చేసేది. ఆ కంపెనీ తరఫున కూడా రాకేష్ పని చేసేవాడు. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరేళ్లుగా సహజీవనం చేశారు.

English summary
Uttar Pradesh youth arrested in Hyderabad for killing widow in last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X