యూపీఎఎస్ అప్‌డేట్: తెలంగాణలో 2 రోజులు ఆన్‌లైన్ సేవల్ బంద్: నేడు రిజిస్ట్రేషన్లు ఉండవు

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం రాత్రి నుంచి జులై 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు నిలిచిపోనున్నాయి. 48 గంటలపాటు సేవలు నిలిపివేస్తున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది. ఏ వెబ్‌సైట్లు ఆగిపోనున్నాయో.. ఆయా వెబ్‌సైట్ల స్క్రీన్ పై ఈ మేరకు స్క్రోల్ కానుందని తెలిపింది.

రాష్ట్రంలోని ఆన్‌లైన్ సేవలన్నీ గచ్చిబౌలిలో ఉన్న స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగానే నడుస్తున్నాయి. అన్ని శాఖలు, విభాగాలకు చెందిన వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలు ఈ డేటా సెంటర్ తోనే అనుసంధానమై ఉంటాయి. ఈ డేటా సెంటర్లో ఉన్న యూపీఎస్ మార్చాలని ఐటీ శాఖ నిర్ణయించింది.

UPS update: Two days government online services stalled

ప్రస్తుతం ఉన్న యూపీఎస్‌లో సమస్యలు తలెత్తుతుండటం, సేవలకు అంతరాయం కలుగుతుండటంతో కొత్త యూపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయనుంది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు కొన్ని ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు, వెబ్‌సైట్లు పనిచేయవు.

అయితే, రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు కావడంతో ప్రజలకు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చే ఈ రోజుల్లో యూపీఎస్ మార్చుతున్నట్లు తెలుస్తోంది. యూపీఎస్ మార్చడంతోపాటు ఇతర మెయింటనెన్స్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేయనున్నారు.

Recommended Video

    Telangana కళాకారులకు ఏంతక్కువ.. MAA ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న సీవీఎల్

    ఇది ఇలావుండగా, తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం రిజిస్ట్రేషన్లు జరగవు. రాష్ట్ర డేటా సెంటర్‌లో ఐటీ శాఖ కొత్త యూపీఎస్‌లను ఏర్పాటు చేస్తుండటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు ప్రాతిపదికగా ఉన్న కార్డ్ విధానం, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ సేవలు గురువారం రాత్రి 7 గంటలకే నిలిచిపోయాయి. ఇక శుక్రవారం కూడా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సహా ఇతర సేవలు అందుబాటులో ఉండవు. రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో సోమవారం నుంచి తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+