"అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులు"
తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త. ఈ నెల 14న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి కొత్త కార్డులు జారీ కానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 14 న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా వెల్లడించారు. కొత్తగా దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వివరించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
కొత్త రేషన్ కార్డుల సమస్య ఇప్పటిది కాదు.. బీఆర్ఎస్ హయాం నుంచే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన లక్షలాది మందికి రేషన్ కార్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాక ముందే అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ మేరకు ఇటీవల సివిల్ సప్లయిస్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని.. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

అయితే ఈసారి కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయించనున్నట్లు సమాచారం అందుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే నియోజకవర్గాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ కొనసాగనుంది.












Click it and Unblock the Notifications