'అంతా తూచ్, రాహుల్ గాంధీని కలవలేదు': రేవంత్ చేరికపై కాంగ్రెస్ మెలిక!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం స్పందించారు.
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం స్పందించారు.

రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారని, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని చర్చలు జరిగాయి. త్వరలో రాహుల్ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు.

అంతా తూచ్, రాహుల్ గాంధీని మేం కలువలేదు
ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి, తాను కలిసి రాహుల్ గాంధీని కలిశామనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. పార్టీ పనుల్లో భాగంగానే తాను ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. రాహుల్ గాంధీతో భేటీ సాధారణమే అన్నారు.

నో కామెంట్ అన్నారు
కాగా, మంగళవారం రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన గంటసేపటికి రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్.. రేవంత్‌ను రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రచారంపై నో కామెంట్ అన్నారు.

రేవంత్ రెడ్డి పైన మాట్లాడని కుంతియా
రేవంత్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారనే విషయం తెలిసి పలువురు తెలంగాణ సీనియర్ నేతలు వెంటనే పార్టీ ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ ఇంచార్జ్ కుంతియాకు ఫోన్ చేశారు. రేవంత్ చేరికపై ఆరా తీసారు. ఆయన చేరికపై కొందరికి ఏమీ చెప్పలేదని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి చేరికపై కాంగ్రెస్ మెలిక
మరికొందరితో మాత్రం కుంతియా కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. రేవంత్ రెడ్డి లేదా ఇతర టిడిపి నేతలు పార్టీలోకి వస్తే సీనియర్లు, స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. తద్వారా స్థానిక కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డితో చిక్కులు రావనుకున్న తర్వాతనే ఆయనను పార్టీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications