వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీళ్లనీ చెప్పుతో కొట్టాలి: కేటీఆర్‌కు వీహెచ్ కౌంటర్

లంచం అడిగితే చెప్పుతో కొట్టాలన్న మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యలు ఆహ్వానించదగ్గవేనంటూనే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా గాంధీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: లంచం అడిగితే చెప్పుతో కొట్టాలన్న మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యలు ఆహ్వానించదగ్గవేనంటూనే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో సీనియర్‌ నేతలు.... జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాలు మరిచి అబద్ధాలు, మోసం చేసేవారిని కూడా చెప్పుతో కొట్టాలన్నారు. అవినీతి కంటే ఇచ్చిన మాట తప్పడమే పెద్ద మోసమన్నారు.

v hanumantha rao counter to KTR

టీఆర్ఎస్.. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని వీహెచ్‌ ప్రశ్నించారు. రెండు పడకగదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని కూడా అదే విధంగా శిక్షించాలన్నారు.

మాటలతోనే సరిపెడుతున్నారు: లక్ష్మణ్ ఫైర్

ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం మాటలతో సరిపెడుతోందని, చేతల్లో చూపించాల్సి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బాబూ జగజ్జీవన్‌రామ్ 110 వ జయంతిని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన పలుకార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా జగజ్జీవన్‌రామ్ ఆశయాలు నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేసేలా సంకల్పం పూనుకోవాలని అన్నారు. 70 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం కూడా దళితుల జీవితాల్లో మార్పు రావల్సి ఉందని అన్నారు.

కేంద్రం దళితులకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించిందని, స్టాండ్ అప్ ఇండియా పేరుతో నిధులను ప్రత్యేకించిందని, బ్యాంకుల ద్వారా కోటి రూపాయిల వర కూ రుణాలను మం జూరు చేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసిందని అన్నారు. దళితులకు కేటాయించిన నిధులను మళ్లించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా వారిపై దాడులు జరిగితే ఆ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

English summary
Congress senior leader v hanumantha rao counter attack on Telangana minister KTR comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X