వనజాక్షిని తప్పుపట్టడం దారుణం: చంద్రబాబును అడ్డుకుంటామన్న వీహెచ్

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానా లూటీ కాకుండా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ముసునూరు తహశీల్దార్ వనజాక్షిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుపట్టడం దారుణమని కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మీడియాతో మాట్లాడారు.

చోరీని అడ్డుకోవడమే వనజాక్షి చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలనలో భాగమైన తహసీల్దార్‌ వనజాక్షిని చంద్రబాబు బెదిరించడం ఉద్యోగులకు అభద్రతా భావాన్ని కలిగిస్తోందని ఆందోళన వెలిబుచ్చారు.

V Hanumantha Rao fires at Chandrababu

అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటనను అడ్డుకుంటే.. హైదరాబాద్‌లో చంద్రబాబును అడ్డుకుంటామని హనుమంతరావు అన్నారు. రాహుల్‌ పర్యటనపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని గుర్తుచేశారు. మైనార్టీలు, క్రిస్టియన్ల సంక్షేమం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ నేత హర్షకుమార్‌ను అరెస్ట్ చేయాడాన్ని వీహెచ్ ఖండించారు. హర్షకుమార్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారో ప్రభుత్వం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+