వాస్తు ఎఫెక్ట్: సచివాలయానికి కెసిఆర్ 3సార్లే, రాజ్‌భవన్‌కి పలుమార్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాస్తును బలంగా నమ్ముతారనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన సచివాలయానికి అరుదుగా వస్తున్నారని, అందుకు వాస్తుయే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత నెలలో కెసిఆర్ సచివాలయానికి మూడుసార్లు మాత్రమే వచ్చారు. ఎక్కువ సమయం క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు. అలాకాకుంటే జూబ్లీహిల్స్‌లోని హెచ్ఆర్డీ కార్యాలయం నుంచి రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వాస్తు బాగాలేదన్న కారణంతోనే కెసిఆర్ క్యాంప్ కార్యాలయంకు అనుబంధంగా ఉన్న పెద్ద భవనాన్ని కూడా వాడటం లేదని తెలుస్తోంది. సచివాలయానికి కెసిఆర్ రాకపోవడం వల్ల పలు ఫైళ్లు పెండింగులో ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు, కెసిఆర్ రాజ్ భవన్‌ను ఈ ఏడాదిలో ఎక్కువసార్లు సందర్శించారు. ఏడాది కాలంలో పన్నెండుసార్లకు పైనా ఆయన గవర్నర్ నరసింహన్‌తో రాజ్ భవన్లో భేటీ అయ్యారు. అదే సమయంలో గత నెల వరకు చంద్రబాబ నాయుడు గవర్నర్‌తో ఐదుసార్లు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications