ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటాం..! పాశ్చాత్య సంస్కృతి అవసరం లేదంటున్న భజరంగ్ దళ్..!!
హైదరాబాద్ : ప్రేమికులకు చేదు వార్త వినిపిస్తున్నాయి వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పార్టీలు. పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ వ్యతికిస్తున్నాయని, ఫిబ్రవరి 14న వాలంటైన్ డే పేరిట జరిగే అన్ని కార్యాక్రమాలను అడ్డుకుంటామని వీహెచ్‌పీ స్టేట్ కన్వీనర్ సుభాష్‌చందర్ తెలిపారు. వాలంటైన్ అనే వ్యక్తి రోమ్ రాజ్యానికి చెందిన దేశద్రోహి అని, అలాంటి వ్యక్తికి సంబంధించిన రోజున వారి దేశంలోనే ప్రేమికుల రోజు నిర్వహించడం లేదన్నారు. కానీ మన దేశంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రేమికుల రోజు పేరిట సమాజాన్ని, యువతను తప్పు దోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా పబ్‌లు, రిసార్ట్స్, హోటళ్లలో ఈ కార్యక్రమాలను నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. తాము ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం కాదని, భజరంగ్‌దళ్ ప్రేమికుల దినోత్సవానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. ప్రేమికులు మల్టీనేషనల్ కంపెనీల ఉచ్చులో పడవద్దని సూచించారు. ఈ సందర్బంగా వాలంటైన్ డే వ్యతిరేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, మహంకాళి విభాగ్ కన్వీనర్ జీవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్కుల్లో, రోడ్ల పక్కన ప్రేమికులు కనిపిస్తే ఊహించని పరిణామలు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. సో.. ప్రేమికులారా..! జర జాగ్రత్త సుమీ..!!
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications