కొత్తగూడెం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ నుండి వనమా రాఘవ సస్పెన్షన్.. ఘటన జరిగిన ఐదురోజులకు గులాబీ పార్టీ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవను అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం ఇన్‌చార్జి నూకల నరేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణా పోలీసులకు పింక్ డ్రెస్; గవర్నర్ కు, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం: తరుణ్ చుగ్తెలంగాణా పోలీసులకు పింక్ డ్రెస్; గవర్నర్ కు, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం: తరుణ్ చుగ్

 వనమా రాఘవపై సంచలన ఆరోపణలు చేసిన ఆత్మహత్యకు పాల్పడిన వ్యాపారి

వనమా రాఘవపై సంచలన ఆరోపణలు చేసిన ఆత్మహత్యకు పాల్పడిన వ్యాపారి

జనవరి 2వ తేదీ ఆదివారం కొత్తగూడెంలో ఓ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావుపై, మృతుడు సెల్ఫీ వీడియో లో చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఎమ్మెల్యే అయిన తండ్రి వనమా వెంకటేశ్వరరావు పలుకుబడిని అడ్డంపెట్టుకుని వనమా రాఘవ ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువగా మారాయి. నాగారామక్రిష్ణ తాను ఆత్మహత్యకు పాల్పడే ముందు కూడా వనమా రాఘవపై సంచలన ఆరోపణలు చేశారు.

 వనమా రాఘవపై ఆరోపణల వెల్లువ.. స్పందించిన పార్టీ, ఐదు రోజుల తర్వాత సస్పెన్షన్

వనమా రాఘవపై ఆరోపణల వెల్లువ.. స్పందించిన పార్టీ, ఐదు రోజుల తర్వాత సస్పెన్షన్

కొత్తగూడెం వ్యాపారి ఎం నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఇన్ని రోజులు అవుతున్నా వనమా రాఘవను అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీల నుండి ఆరోపణలు వెల్లువగా మారాయి. వనమా రాఘవను టిఆర్ఎస్ పార్టీ నే కాపాడుతుంది అంటూ, ఇప్పటివరకు అరెస్ట్ చెయ్యకుండా ఎక్కడ దాచిపెట్టారు అంటూ ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ స్పందించింది. వనమా రాఘవ పై చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత టిఆర్ఎస్ పార్టీ వనమా రాఘవను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు గా అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది.

ఆస్తి తగాదాల్లో తలదూర్చిన వనమా రాఘవ, బాధితుడి భార్యపై కామవాంఛ

ఆస్తి తగాదాల్లో తలదూర్చిన వనమా రాఘవ, బాధితుడి భార్యపై కామవాంఛ


కేసు విషయానికి వస్తే కొత్తగూడానికి చెందిన వ్యాపారి నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ చేసి కుటుంబసభ్యులతో పాటు నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఎం నాగ రామకృష్ణ కుమార్తె ప్రాణాలతో బయట పడింది. తన కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరిస్తానని ఈ వ్యవహారంలో తలదూర్చిన రాఘవేంద్ర రావు తనకు సహాయం చేయడానికి బదులుగా తన భార్య నుండి లైంగిక ప్రయోజనాలను కోరినట్టు సూసైడ్ నోట్ లో, అలాగే సెల్ఫీ వీడియో లో నాగ రామకృష్ణ ఆరోపించారు.

ఆరోపణలు తోసిపుచ్చిన రాఘవ, పరారీలో.. గాలింపు చేస్తున్న పోలీసులు

ఆరోపణలు తోసిపుచ్చిన రాఘవ, పరారీలో.. గాలింపు చేస్తున్న పోలీసులు

అది తనను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అంటూ ఆయన పేర్కొన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా వనమా రాఘవను ఏ2 గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన పోలీసులు రాఘవ పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఇప్పటికే తోసిపుచ్చిన వనమా రాఘవ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పాల్వంచ ఏసిపి రోహిత్ రాజు వనమా రాఘవను ఇంకా అరెస్ట్ చేయలేదని, అతడు పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. గురువారం సాయంత్రం వనమా రాఘవను తరలిస్తున్నట్లు గా మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఏసీపీ స్పష్టం చేశారు.

English summary
TRS party has suspended Vanama Raghavendra Rao alias Raghava, son of Kothagudem MLA Vanama Venkateshwara Rao, from the party with immediate effect on the allegations of suicided victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X