రాజకీయ సమీక్షలతో పాటు వేదమంత్రాలు.!తెలంగాణ సెక్రటేరియట్ లో ఆధ్యాత్మిక శోభ.!
హైదరాబాద్ : ఇక తెలంగాణ సచివాలయంలో వేదమంత్రాలు, గుడి గంటలు వినబడబోతున్నాయి. ఆధ్యత్మిక వాతారణం కూడా కనిపించబోతుంది. అందుకోసం సీఎం చంద్రశేఖర్ రావు ప్రత్యాక దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లోని ప్రార్థనా మందిరాలు గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై, సీఎం చంద్రశేఖర్ రావుతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు.. గత మూడు రోజులుగా జరుగుతున్న నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుంచి జరిగిన చండీయాగం, అమ్మవారి శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఱుత్వికులు నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి పాల్గొన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు సూచనలకు అనుగుణంగా ఆలయ పున:ప్రతిష్ట ఏర్పాట్లను, పూజా కార్యక్రమాలను మంత్రి వేముల అందరినీ సమన్వయం చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, గవర్నర్ కు మంగళ వాయిద్యాలతో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

మంత్రి వెంట ఉదయం నుంచి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్ అండ్ బి సెక్రెటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సి గణపతి రెడ్డి, పలువురు ఆర్ అండ్ బి అధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు దంపతులు, సచివాలయం ఉద్యోగులు పూజా కార్యక్రమాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications