ద్రోహులే వారి పక్కన: తెరాస నేతలపై వేం ఫైర్
శ్రీశైలం ప్రాజెక్టు పూర్ణానంద ఆశ్రమంనందు ఒక పసికందు మృత్యవాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ ఉద్యమ ద్రోహులను పక్కన కూర్చుపెట్టుకున్న మంత్రిపదవులు ఇచ్చిన టీఆర్ఎస్ నాయుకులే తెలంగాణ ద్రోహులని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకునేలా పాలకపక్షంపై పోరాటం చేస్తున్న టీడీపీ పై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్య మాన్ని వ్యతిరేకించినా, వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మల నాగేశ్వర్రావు లాంటివా రిని చేర్చుకున్న టీఆర్ఎస్ పార్టీయే ద్రోహల పార్టీ అన్నారు.












Click it and Unblock the Notifications