తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఫైనల్

తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ అభ్యర్థులను ఖరారు చేసింది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. ఈ ఇద్దరు నేతలు ఓపెన్ కేటగిరీకి చెందినవారే. అభిషేక్ మను సింఘ్వీ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు కూడా. నేడు వేం నరేందర్, అభిషేక్ సింఘ్వీ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లను దాఖలు చేయడానికి నేడు చివరి తేదీ.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సంస్థాగత సేవలకు అత్యంత కీలకమైన నేతలకే అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చింది. సామాజిక న్యాయం, సమతుల్యత వంటి చర్చలను పక్కనపెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా సేవలను అందిస్తోండటం, జాతీయ స్థాయిలో తెలంగాణ అవసరాలు, పార్టీ గళాన్ని రాజ్యసభలో గట్టిగా వినిపించడానికి సమర్థులైన నాయకులను ఎన్నుకునే క్రమంలో వీరిద్దరికీ ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Vem Narender Reddy Secures Congress Rajya Sabha Bid from Telangana Along With Abhishek Manu Singhvi

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి పలువురు ఆశావహులు పార్టీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ, నాయకత్వం చివరికి ఓపెన్ కేటగిరీకి చెందిన ఇద్దరు అభ్యర్థులనే ఎంపిక చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మొదటి నుంచీ అభిషేక్ మను సింఘ్వీకి తిరిగి అవకాశం లభిస్తుందని సంకేతాలు ఇచ్చింది. రెండవ సీటుపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. ప్రారంభంలో జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పేరు ప్రచారంలో నిలిచింది.

బీసీ, మైనారిటీ వర్గాల నేతల నుంచి విమర్శలు రావడంతో రాష్ట్ర నాయకత్వం వ్యూహాన్ని మార్చుకుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో లేరని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడంతో వేం నరేందర్ రెడ్డి అభ్యర్ధిత్వానికి మార్గం సుగమమైంది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సంప్రదింపుల అనంతరం అధిష్టానానికి 16 పేర్లను పంపినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైంది. అంతకుముందు, వేం నరేందర్ రెడ్డి, దొమ్మటి సాంబయ్యల అభ్యర్ధిత్వంపై తుది నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర యూనిట్ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. విస్తృత సంప్రదింపుల తర్వాతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, ఏకపక్ష నిర్ణయాలను తీసుకోలేదని స్పష్టం చేశాయి.

కాగా- తనను రాజ్యసభకు నామినేట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఎంపీ ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+