మహమ్మద్ అలీ జిన్నాను తిట్టిపోసిన పాక్ మేధావి, విభేదించిన వెంకట్
హైదరాబాద్: పాకిస్తాన్ ఆవిర్భావానికి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా పైన పాకిస్తాన్ మేధావి, రచయిత పర్వేజ్ అమిరాలి హుద్‌భోయ్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు. సరిగ్గా ఉర్దూ మాట్లాడలేని జిన్నా పాకిస్థాన్‌లో ఉర్దూను అధికారభాషగా ప్రకటించటానికి ప్రయత్నించాడన్నారు. జిన్నా అయోమయ మనిషన్నారు.
హైదరాబాద్ సాంస్కృతిక వేడుకలో భాగంగా శనివారం పాకిస్థాన్ పునరాకృతిపై పర్వేజ్ అమిరాలి మాట్లాడారు. హిస్టరీ లెక్చరర్, రచయిత వెంకట్ ధూళిపాల ఆయన వ్యాఖ్యల పైన స్పందించారు. పాక్ రచయిత వ్యాఖ్యలతో వెంకట్ విభేదించారు.

జిన్నా అయోమయంలో కాకుండా ఆలోచించే వ్యవహరించాడన్నారు. జిన్నా లౌకికవాది అని, యురోపియన్ తరహా దేశంగా పాకిస్థాన్‌ను చేయాలనుకున్నాడని, భారత్‌కు పోటీగానే కాకుండా ముస్లిం దేశాలకు పాకిస్థాన్‌ను పెద్దన్నగా తీర్చిదిద్దాలనుకున్నారని వెంకట్ దూళిపాల అన్నారు.
బతికి ఉంటే జవహర్ లాల్ నెహ్రూలా పాకిస్థాన్‌ను తన ఆలోచనల మేరకు తయారు చేసేవాడన్నారు. పాకిస్తాన్‌కు ఇస్లామిక్ స్వభావం ఉండాలనుకున్నారే తప్ప అదెలా ఉండాలనే దానిపై స్పష్టత లేకపోవటమే ఇబ్బందిగా తయారైందనివెంకట్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications