మా నష్టానికి బాధ్యులెవరు.. హైడ్రా కూల్చివేతలతో దొర్లి దొర్లి ఏడుస్తున్న బాధితులు!
హైదరాబాద్లో మొన్నటి వరకు కూల్చివేతలకు బ్రేక్ వేసిన హైడ్రా మళ్ళీ కూల్చివేతలను మొదలుపెట్టింది. హైదరాబాదులోని చెరువుల ఆక్రమణలపైన కొరడా ఝుళిపిస్తుంది. ఈరోజు కూకట్ పల్లి నల్ల చెరువులో 16 కమర్షియల్ షెడ్లను కూల్చివేసి నాలుగు ఎకరాలను స్వాధీనం చేసుకుంది హైడ్రా. మరోవైపు అమీన్ పూర్ కృష్ణారెడ్డిపేటలో మూడు భవనాలు కూల్చివేసి ఎకరం స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.
నేడు 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
అంతేకాదు పటేల్ గూడాలో 25 విల్లాలను కూల్చిన హైడ్రా అధికారులు మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మొత్తం మూడు ప్రాంతాలలో కూల్చివేతలతో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు హైడ్రా అధికారులు. భారీగా పోలీసులను మోహరించి కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా అధికారుల పైన అక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రెండు నెలల గడువైనా ఇవ్వాలని విజ్ఞప్తి.. కనికరించని హైడ్రా
కూకట్ పల్లిలోని నల్లచెరువులో ఆక్రమణలను కూల్చివేసే సమయంలో అక్కడ స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. కనీసం తమకు రెండు నెలల గడువైనా ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయినా హైడ్రా కనికరించలేదు. నా భార్య కడుపుతో ఉంది సామాన్లు తీసుకునే టైమ్ కూడా ఇవ్వరా అంటూ ఓ బాధితుడు వాపోతున్నా పట్టించుకోలేదు.
మా నష్టానికి బాధ్యులెవరు.. బాధితులు కన్నీరుమున్నీరు
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు పాల్పడుతున్నారని, తమకు జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న తమను ఈ రకంగా నడిరోడ్డున పడేయడం భావ్యం కాదని వారు లబోదిపోమన్నారు. హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్న వారు వారి షెడ్లలోని సామాన్లు బయటపెట్టుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదు.. సామాన్లు తీసుకునే వరకు అయిన ఆగండి అన్నా కూడా ఆగడం లేదు
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2024
ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఇది అధికారుల తప్పే వాళ్ళు కట్టడానికి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు.. వాళ్ళు ఏది ఇయ్యకుండా ఉంటే ఇంతకాడికి రాదు కదా
లోపల నుండి సామాన్లు తీస్తుంటే… https://t.co/1eKxLikYJG pic.twitter.com/XdwddGlcRp
వీధిన పడేశారని బాధితుల ఆవేదన
కిందపడి దొర్లి దొరలు ఏడ్చారు. ఇది చాలా అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందే చెబితే అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతాలలో షాపులు ఏర్పాటు చేసుకునే వారిమని, అలా కాకుండా అకస్మాత్తుగా వచ్చి కూల్చివేతలకు పాల్పడడం దారుణమని వారు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నడిరోడ్డుకు లాగిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
నా భార్య కడుపుతో ఉంది సామాన్లు తీసుకునే టైమ్ కూడా ఇవ్వరా - హైడ్రా బాధితులు pic.twitter.com/MInrRrg3fP
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2024
రేపటి నుండి ఎలా బ్రతకాలి.. రేవంత్ కు బాధితుల ప్రశ్న
ఇప్పటికైనా హైడ్రా కూల్చివేతలపైన రేవంత్ సర్కార్ తమ వంటి మధ్యతరగతి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు. తాము నిర్వహిస్తున్న షాపులు ఎఫ్టిఎల్ పరిధిలో, బఫర్ జోన్ లో ఉన్నట్టు తమకు తెలియదని, ఒకవేళ అలా తెలిస్తే తాము వేరే ప్రాంతంలో షాపులను నిర్వహించుకునే వారిమని వారు లబోదిబోమంటున్నారు. రేపటి నుంచి తాము ఎలా బ్రతకాలి అని రేవంత్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ నష్టానికి బాధ్యులు ఎవరు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కన్నీళ్ళతో అడుగుతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications