మంజీరా సొగసు చూడతరమా..!!
మంజీరమ్మ పాదాల చెంత ఉన్న నీరు నిమిషంబులో తన తీరు మార్చుకుంది. పైన వెళుతున్న తన మేఘాల మిత్రులను చూసి కింద నుంచి పైకి ఉబికింది. సొగసుగా సోయగాలొలికిస్తూ పైకి.. పైపైకి.. వెళుతూ చేసిన ప్రకృతి విన్యాసం సృష్టిలో మనకు తెలియని ఎన్ని విచిత్రాలుంటాయనేదానికి ఒక ఉదాహరణగా నిలిచింది.
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నిర్జప్ల గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక్కసారిగా సుడిగాలి రేగింది. ఆ తర్వాత నదిలోని నీరు గింగిరాలు తిరుగుతూ ఆకాశానికి ఎగిసింది. తెల్లని ధారలా మూడు నిముషాల సేపు ఎగసింది. అది చూసిన ప్రజలు ఆశ్చర్య చకితులయ్యారు. సాధారణంగా నీరు పై నుంచి కిందకు పడుతుంది. అందుకే మన పెద్దలు నీరు పల్లమెరుగు అంటారు. కానీ ఇక్కడ పల్లం నుంచి ఆకాశానికి పాకింది.
మంజీరా నదిలో అద్భుత దృశ్యం..ఆకాశం నుంచి నదిలోకి తెల్లని ధార..!!#Sangareddy #ManjeeraRiver #Vatpalli #TelanganaNews #Tornado #OneIndiaTelugu pic.twitter.com/dIHJkcFnDq
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2022

అమెరికా లాంటి దేశాల్లో టోర్నెడోల గురించి అందరికీ తెలుసు. చూస్తూ ఉండగానే సుడిగాలి గిర్రున తిరుగుతూ కింద నుంచి పైకి ఎగస్తుంది. అచ్చం అలాగే మంజీరా నదిలోని నీరు హొయలొలికించడం చూసినవారు ధన్యులయ్యారంటూ ప్రకృతి ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఎందుకొచ్చిందో తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications