మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు: విద్యాసాగర్‌రావు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం అంతర్జాతీయ గుర్తింపును పొందిందని నీటి పారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు అన్నారు.
వరంగల్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం అంతర్జాతీయ గుర్తింపును పొందిందని నీటి పారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు అన్నారు. కేయూ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం సెనెట్ హాలులో 'మిషన్ కాకతీయ - ఏ న్యూ హోప్ ఫర్ సస్టెనబుల్ రూరల్ డెవలప్‌మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్' అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
PHOTOS : టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ప్రెజెంట్స్ మీడియా మిషన్ కాకతీయ అవార్డ్స్
అనంతరం మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తుందని అన్నారు. అమెరికాలోని చికాగో, మిచిగన్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు వీటి అధ్యయనం కోసం భారత్ వచ్చారని చెప్పారు. రాష్ట్రంలోని 46,531 చెరువులను రానున్న ఐదేళ్లలో పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల వివాదాలతో మనకు గోదావరి నుంచి వచ్చే 954, కృష్ణా నుంచి అందే 299 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వాడుకోలేక పోతున్నట్లు వివరించారు.
నీటి నిల్వతో వ్యవసాయానికి మేలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్ర విభాగం శాఖాధిపతి ఆచార్య సి గణేష్ మాట్లాడుతూ.. దేశంలోని నీటి సామర్థ్యాన్ని సద్వినియోగం చేస్తే వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని వివరించారు. మిషన్ కాకతీయతో పలు ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్ సాయన్న ప్రసంగిస్తూ మిషన్‌కాకతీయతో ఆహార ఉత్పత్తులు పెరుగుతాయని అన్నారు.

సదస్సు సంచాలకుడు ఆచార్య టి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎంతో ప్రయోజనంగా మారిన మిషన్ కాకతీయపై విద్యార్థి, మేధావి వర్గాల్లో అవగాహనను కల్గించడం కోసం రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. . సదస్సు వివరాలను పొందుపరుస్తూ రూపొందించిన సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు.
మిషన్ కాకతీయపై ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. సమావేశంలో కేయూ అకడమిక్ అడిట్ డీన్ ఆచార్య టి.రమేష్, కేయూ అధ్యాపకులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.రామానుజారావు, కేయూ సోషల్‌సైన్స్ డీన్ ఆచార్య ఎస్.శ్రీనాథ్, విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు, నీలరాములు పాల్గొన్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications