వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుఎన్ లో జరిగే మేయర్ల సదస్సుకు విజయలక్ష్మి కి ఆహ్వానం.!భారత్ నుండి పాల్గొననున్న ఏకైక మేయర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై యునెటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్మ్షి కి అరుధైన ఆహ్వానం లభించింది. ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లకు మాత్రమే ఈ వెబ్ ఆధారిత సదస్సులో పాల్గొనేందుకు అవకాశం దక్కగా భారతదేశం నుండి కేవలం హైదరాబాద్ నగర మేయర్ కు మాత్రమే ఈ అవకాశం లభించింది.

ఏప్రిల్ 16వ తేది శుక్రవారం ఉదయం 10:45 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటారెస్ స్వాగతోపాన్యాసం చేస్తారు. ఈ సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్న లాస్ ఎంజెల్స్ మేయర్ ఎరిక్ గర్సెట్టి కూడా అధ్యక్ష స్థానంలో ఉపన్యాసం చేస్తారు. కోవిడ్-19 మహమ్మారిని అదిగమించడం, హరిత, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, నిర్థారిత లక్ష్యాలపై మేయర్లు ప్రసంగిస్తారు.

Vijayalakshmi invited to UN mayor conference..The only mayor from India to participate.!

వీరితో పాటు యూనైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైమూనా మహ్మద్ షరీఫ్ కూడా ప్రసంగించే ఈ సదస్సులో మెల్బోర్, టోకియో, జకాత, వియోడీజినిరో, ప్యారీస్, మిలన్, మాంట్రియల్, బార్సిలోనా, జోహనస్ బర్గ్ తదితర ప్రముఖ అంతర్జాతీయ నగరాల మేయర్లు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా ఈ సదస్సు లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ప్రసంగిస్తారు. పర్యవరణ పరిక్షణ, కాలూష్య నివారణ, పచ్చదనం తదితర అంశాల గురించి మేయర్ విజయలక్ష్మి ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి.

English summary
Participate in Global Mayors' Meeting under the auspices of United Nations Information and Communication Technology on Measures to be taken to reduce carbon emissions to the atmosphere and to improve living standards in cities, Hyderabad City Mayor Vijayalakshmi received a rare invitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X