నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వెళ్ళకూడదనే ప్రతిపక్షాల నిర్ణయం అందుకే: విజయశాంతి సెటైర్లు!!
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే అనేక ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యాధునిక వసతులు, చరిత్రను గుర్తు చేసే ఎన్నో విశేషాలు, కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించడాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రధాని కాదని కాంగ్రెసు మాజీ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సిపిఐ, సిపిఎం, ఆర్జెడి, డి పి ఐ, ఎం డి ఎం కె, డి ఎం కె తదితర పార్టీలు బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.

ఇక ఈ నేపథ్యంలో బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి ప్రతిపక్షాలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించడం పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇప్పటికే ప్రజలు ప్రతిపక్షాల నాయకులను పెద్దగా పార్లమెంటుకు పంపడం లేదని, ఇప్పుడు వీరు వెళ్లకూడదనే నిర్ణయం కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే కావచ్చు అంటూ సెటైర్లు వేశారు.
పార్లమెంట్‌కు ప్రతిపక్షాలను దేశ ప్రజలే ఎంపీలుగా సరైన సంఖ్యలో పంపటం గత 2 ఎన్నికల నుండి జరగలేదు అని పేర్కొన్న విజయశాంతి రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే ఫలితాలను ఇస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు మరోసారి ఇయ్యటం స్పష్టమని అనిపిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు కొన్ని బాయ్‌కాట్ చెయ్యడం అనే నిర్ణయం ఇప్పటికే ఆ పార్టీలు పార్లమెంట్‌కు వెళ్లొద్దనే... ప్రజల అభిప్రాయాన్ని ఎంతో కొంత గౌరవించడమే కావచ్చు అంటూ విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలే ప్రతిపక్షాల నాయకులు పార్లమెంటుకు పంపొద్దని భావిస్తున్నారని, ఈ మేరకు ప్రస్తుతం పార్టీ తీసుకున్న నిర్ణయం కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించే అయ్యుంటుందని విజయశాంతి సెటైర్లు వేశారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications