కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్నలు.. ప్రభుత్వ భూముల అమ్మకం తప్పు.. రైట్ ఎలా అవుతుంది ?
బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడంపై మండిపడిన విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుత తెలంగాణా పరిస్థితి అర్థం కావాలంటే నేడు పత్రికల్లో వచ్చిన కథనాలు నిదర్శనం అంటూ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన విజయశాంతి ప్రభుత్వ భూములు అమ్మి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పని చేస్తోందంటూ నిప్పులు చెరిగారు.

కేసీఆర్ సర్కార్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్న విజయశాంతి
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను పెద్ద మొత్తంలో అమ్మేసి, అన్నింటినీ ప్రైవేటీకరించడం లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పెట్టుకుందని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు. భూముల అమ్మకాలపై మంత్రి హరీష్ రావు స్పందించారని గత ప్రభుత్వాలు భూములు అమ్మగా లేంది మేం చేస్తే తప్పా అంటూ ప్రశ్నించారని పేర్కొన్న విజయశాంతి, నాడు ఆ సర్కారు చేసిన తప్పును అన్ని వర్గాలు ఎండగట్టాయని అదే తప్పు మీరు చేస్తే రైట్ ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు.

యూనివర్సిటీలలో దారుణ స్థితి , గాడి తప్పిన విద్యా వ్యవస్థ
అవకతవక రెవిన్యూ విధానాలతో తెలంగాణ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యా వ్యవస్థపై పలు ప్రశ్నలు సంధించిన విజయశాంతి మొన్నటి వరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలు లేక పాలన గాడి తప్పిందని ఇక ఈ విషయాన్ని స్వయంగా గవర్నర్ ఘాటుగా ప్రభుత్వానికి లేఖ రాసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోందని, అన్నీ యూనివర్సిటీలలోనూ దాదాపు 3 వంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు.
Recommended Video

తెలంగాణ సర్కార్ కుప్పకూలితే గాని మంచి రోజులు రావు
దీంతో విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి పేర్కొన్నారు. సుమారు 1000కి పైగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నాలుగేళ్ల కిందటే నిర్ణయం తీసుకొని కూడా భర్తీ చేయకుండా ఎందుకు వదిలేశారో చెప్పాలని ప్రశ్నించిన విజయశాంతి, తెలంగాణ సర్కార్ కుప్పకూలితే గాని మంచి రోజులు రావని, లేదంటే వ్యవస్థలు ఇదేవిధంగా భ్రష్టుపట్టి పోతాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications