కేసీఆర్ సర్కారు తెలంగాణాకి జాతీయస్థాయిలో తలవంపులు తీసుకొచ్చింది; విరుచుకుపడిన విజయశాంతి!!
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గణేష్ నిమజ్జనోత్సవం లో పాల్గొన్న క్రమంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత పై అధికార టిఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో మత విద్వేషాలు రగల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, అందుకే అస్సాం సీఎంను గణేష్ నిమజ్జనకు ఆహ్వానించారని టిఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే కాషాయ దళం అంటే టీఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతోందని, అందుకే రాష్ట్రానికి ఎవరు వచ్చినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు టిఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.

తెలంగాణలో ఎంత అరాచక వ్యవస్థ నడుస్తోందో అర్ధం అవుతుంది: విజయశాంతి
ఇదిలా ఉంటే బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడారాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను అడ్డుకోవటం కోసం చేసిన కుట్ర అంటూవిరుచుకుపడ్డారు. గణేశ్ నిమజ్జనం కోసం హైదరాబాద్ వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సభలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు చూస్తే తెలంగాణలో ఎంత అరాచక వ్యవస్థ నడుస్తోందో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని విజయశాంతి పేర్కొన్నారు.

కేసీఆర్ సర్కారు తెలంగాణకి జాతీయస్థాయిలో తలవంపులు తీసుకొచ్చింది
రాష్ట్ర మంత్రులు బీజేపీ పైనే ప్రతివిమర్శలు చెయ్యడం చూస్తే ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చుననివిజయశాంతిఆరోపించారు.బిజెపి ని చూసి టిఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో వణికిపోతోందో తెలుస్తూనే ఉందనివిజయశాంతి పేర్కొన్నారు. హైదరాబాద్ వచ్చిన మరొక రాష్ట్ర సీఎంని అవమానించి, కేసీఆర్ సర్కారు తెలంగాణకి జాతీయస్థాయిలో తలవంపులు తీసుకొచ్చిందనివిజయశాంతి మండిపడ్డారు. జరిగినదానికి సిగ్గుతో తలవంచుకోవాల్సిందిపోయిఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాషాయదళం అంటేటిఆర్ఎస్ సర్కార్ భయపడుతుందని అర్థం
బీజేపీ నాయకులు రాష్ట్రంలో నోరు విప్పినా, చిన్నపాటి విమర్శ చేసినా తట్టుకోలేక ఇప్పటికే నిర్బంధాలు, అరెస్టుల పర్వం సాగుతోందని పేర్కొన్నారు . హిమంతబిశ్వ శర్మ కు ఎదురైన అనుభవాన్ని బట్టి కాషాయదళం అంటేటిఆర్ఎస్ సర్కార్ భయపడుతుందని అర్థం అయింది అన్నారు.తెలంగాణకు వచ్చిన మరో రాష్ట్ర సీఎం ని ప్రభుత్వ అతిథిగా, వీవీఐపీగా గౌరవించాల్సింది పోయి, దాడులు చేయించే దుస్థితిలో కేసీఆర్ సర్కారు ఉందని విమర్శించారు. తాజా ఘటనతో తెలంగాణా రాష్ట్రంలో పోలీసుల భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అని విజయశాంతి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications