50 మందికి పైగా ప్రయాణికులు.. బస్సు పల్టీ, నలుగురు మహిళలు దుర్మరణం!

వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 50 మందికి పైగా ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు, స్థానికులు కలిసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారా.. లేదా? క్లారిటీ ఇదే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారా.. లేదా? క్లారిటీ ఇదే!

అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 నుంచి 54 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరంతా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసరం గ్రామం నుంచి వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంట గ్రామానికి బయలుదేరారు. చింతకుంటలో జరిగే ఒక వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వీరంతా వెళ్తుండగా ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

Vikarabad Bus Accident Private Bus Overturns in Ananthagiri Ghat 4 Women Killed Full Details

ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన బస్సు
అనంతగిరి కొండల ఘాట్ రోడ్డు గుండా కిందకు దిగుతున్న సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదం జరగగానే ప్రయాణీకుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయాందోళనకరంగా మారింది. ప్రమాద స్థలంలోనే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. మరో మహిళ వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం!
IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం!

సహాయక చర్యలు ముమ్మరం
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణీకులను బయటకు తీసేందుకు సహాయపడ్డారు. అనంతరం పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ స్నేహా మెహ్రా
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సహాయం అందేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+