Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పక్కింటి వాచ్‌మెన్‌పై సీఐ కుమారుడి దాష్టీకం: సీసీ ఫుటేజీలో దొరికిన వైనం

హైదరాబాద్: అమాయకులపై జులుం ప్రదర్శిస్తున్నారు పోలీసులు వారి కుటుంబ సభ్యులు. వికారాబాద్ సీఐ వేణు గోపాల్ కుమారుడు పృథ్వీరాజ్ తన చదువుకు ఆటంకం కలిగిస్తున్నాడని పక్కింటి ఆపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కుటుంబాన్ని ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించాడు. మాట వినకపోవడంతో ఎనిమిది మంది పోలీసులతో వాచ్‌మన్‌పై దాడి చేయించాడు.

ఇందుకోసం తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌ రాజు కుమారుడు పృధ్వీరాజ్‌ తల్లితో కలిసి హైదరాబాద్‌ కరన్‌బాగ్‌లో నివాసముంటున్నాడు. ఆ పక్కనే ఉన్న డీబీఆర్ ఆపార్ట్‌మెంట్‌లో మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన అమృత్‌(55) వాచ్‌మన్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.

Vikarabad CI Venu Gopal Son Attack on Watchman

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పృధ్వీరాజ్‌ తన చదువుకు ఆటంకం కలిగిస్తున్నాడనే నెపంతో వాచ్‌మన్‌ కుటుంబంతో తరచుగా గొడవపడేవాడు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి అపార్ట్‌మెంట్‌ ఖాళీ చేసి వెళ్లిపోవాలని వాచ్‌మన్‌ కుటుంబానికి సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించాడు. ఈ బెదిరింపును వాచ్ మెన్ పట్టించుకోలేదు.

దీంతో కోపోద్రిక్తుడైన అతడు గురువారం రాత్రి ఇద్దరు సైదాబాద్‌ పోలీసులతో పాటు ఎనిమిది పోలీసులను వెంటబెట్టుకుని పోలీస్‌ వాహనంలో వాచ్‌మన్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చాడు. అందరూ చూస్తుండగానే వాచ్‌మన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. బలవంతంగా పోలీస్‌ వాహనం ఎక్కించారు. అడ్డుకోబోయిన భార్య యాదమ్మపై కూడా పోలీసులు దాడి చేశారు.

అతడిని వాహనంలో కొట్టుకుంటూ సైదాబాద్‌ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి వదిలేసి పోయారు. దీంతో తీవ్ర గాయాలపాలైన వాచ్‌మన్‌ అమృత అతికష్టం మీద అపార్ట్‌మెంట్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని అపార్ట్‌మెంట్‌ వాసులకు తెలియజేశాడు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం దాడి ఘటనపై అమృత్, అతడి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ దాడికి సంబంధించి పృథ్వీరాజ్ సహ ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశామని సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కాట్న సత్తయ్య తెలిపారు. మరోవైపు తమ కుమారుడి పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ పృథ్వీరాజ్‌ తల్లి సైతం పోలీస్‌స్టేషన్‌లో వాచ్‌మెన్‌పై ఫిర్యాదు చేశారు.

రెండు వైపులా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సమగ్ర దర్యాప్తునకు రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడి ఘటనకు సంబంధించి వికారాబాద్ సీఐ వేణు గోపాల్ కుమారుడు పృథ్వీరాజ్‌ని అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+