SSC Paper: పదో తరగతి పరీక్ష పేపర్ లీక్..! ముగ్గురు అధికారుల సస్పెన్షన్..
తెలంగాణలో పేపర్ల లీక్ కలకలం కొనసాగుతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి పరీక్ష లీక్ అయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందని వార్తలు వచ్చాయి. దీంతో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న టెన్త్ పేపర్‌పై పోలీసులు, విద్యాశాఖ దృష్టి సారించింది. పేపర్ లీక్ పై డీఈవో డీఈవో రేణుక దేవి స్పందించారు.
పరీక్షకు ముందే వాట్సాప్ లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలను ఖండించారు. పేపర్ లీక్ కాలేదన్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్స్ పూర్తిగా నిషేధించామన్నారు. 4 పరీక్షా కేంద్రాలు విజిట్ చేసానని ఎక్కడా ఎలాంటి రిమార్క్స్ గానీ, కంప్లైంట్స్ గానీ లేవని స్పష్టం చేశారు. పేపర్ లీక్ పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. కాగా పేపర్ లీక్ వార్తలపై ఇంటలిజెన్స్ పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డీఈవో రేణఉక దేవి మీడియాతో మాట్లాడిన అనంతరం హుటాహుటిన కలెక్టరెట్ కు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కలకలం సృష్టిస్తుంది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులను సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ప్రవీణ్, రాజశేకర్ రెడ్డి, రేణుక, డాక్యా, షమీమ్, రమేశ్ తో పాటు మరికొందరు ఉన్నారు.












Click it and Unblock the Notifications