హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా భర్త అన్ని చెప్పారు, తప్పుడు ప్రచారం ఆపండి: విక్రమ్ భార్య ఆవేదన

హైదరాబాద్‌ నగరంలో కలకలం సృష్టించిన విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి ఆయన భార్య షిపాలి తాజాగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలో కలకలం సృష్టించిన విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి ఆయన భార్య షిపాలి తాజాగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విక్రమ్‌గౌడ్‌ పోలీసులకు తెలియజేశారని శనివారం ఆమె మీడియాకు తెలిపారు.

వీడుతున్న విక్రమ్ కాల్పుల మిస్టరీ: డ్రగ్స్ కేసుతో లింక్, అప్పులే కారణమా?వీడుతున్న విక్రమ్ కాల్పుల మిస్టరీ: డ్రగ్స్ కేసుతో లింక్, అప్పులే కారణమా?

పోలీసులపై నమ్మకం ఉంది..

పోలీసులపై నమ్మకం ఉంది..

కాల్పుల ఘటనలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌గౌడ్‌ వాంగ్మూలం తీసుకునేందుకు ఆస్పత్రికి టాస్క్‌ఫోర్స్‌ డీసీసీ లింబారెడ్డి, బంజారాహిల్స్‌ పోలీసులు వెళ్లారు. వాంగ్మూలం తీసుకున్న అనంతరం షిపాలి మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

తప్పుడు ప్రచారం ఆపాలి..

తప్పుడు ప్రచారం ఆపాలి..

పోలీసులకు అన్ని వివరాలను విక్రమ్‌ గౌడ్‌ చెప్పారని తెలిపారు. ఘటనపై పోలీసులే అన్ని వివరాలు చెబుతారని చెప్పారు. తన భర్తపై దాడిచేసిన వారిని గుర్తించాలని కోరారు. తన భర్తపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మీడియాను కోరారు. విక్రమ్‌గౌడ్‌ ఇచ్చిన వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలకం కానుంది. మరోవైపు కాల్పులు జరిపిన తుపాకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆధారాల సేకరణలో పోలీసులు

ఆధారాల సేకరణలో పోలీసులు

విక్రమ్‌పై కాల్పులు జరపడానికి బయటి నుంచి వేరే వ్యక్తులు వచ్చినట్లు సరైన ఆధారాలు లభ్యం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. అతనే కాల్చుకున్నాడా.. లేక ఇంట్లో ఏమైనా జరిగిందా? అనే దానిపై సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

ప్రాణాలతో బయటపడ్డారు..

ప్రాణాలతో బయటపడ్డారు..

కాగా, తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున విక్రమ్‌గౌడ్‌‌పై కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తీవ్రగాయాలపాలై నెత్తురొడుతున్న విక్రమ్‌గౌడ్‌ను అతని భార్య అపోలో ఆస్పత్రికి తరలించారు. అతని శరీంలోంచి ఒక బుల్లెట్ తీసినట్లు చెబుతున్న వైద్యులు.. విక్రమ్ ప్రాణపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు.

ఎన్నో అనుమానాలు

ఎన్నో అనుమానాలు

కాగా, ఆస్పత్రికి చికిత్స పొందుతున్న విక్రమ్‌ను డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న పూరీ కలవడం వల్లే విక్రమ్‌పై డ్రగ్స్ లింక్స్ ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తనకున్న భారీ అప్పుల కారణంగానే విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. అయితే, పోలీసులకు విక్రమ్ ఏం చెప్పారు? అతనిపై కాల్పులకు తెగబడింది ఎరు? అతనే కాల్చుకుంటే.. కారణాలేంటి? అనేవి సందేహంగా మారాయి.

English summary
Former minister Mukesh Goud son Vikram goud gives details to Police on firing incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X