శిరీష కేసు: కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థుల ధర్నా, ఎందుకంటే?

కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గురువారంనాడు ఆందోళన చేశారు. బ్యూటీషీయన్ శిరీష , ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల విషయంలో పోలీసులు కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని

హైదరాబాద్:కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గురువారంనాడు ఆందోళన చేశారు. బ్యూటీషీయన్ శిరీష , ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల విషయంలో పోలీసులు కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న రోజునే గ్రామస్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. అంతేకాదు ఎస్ఐ పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారనే నెపంతో ఓ మీడియా వాహనంపై దాడికి దిగారు.

villagers protests in front of Kukunoorpally police station

ఎస్ఐ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆనాడు ఆరోపించారు. మరోవైపు ఇవాళ కూడ గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

బ్యూటీషీయన్ శిరీష కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ కు వెళ్ళలేదని గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 1వ, తేది నుండి సీసీటీవి పుటేజీ లభించకపోవడం కూడ పోలీసులకు ఇబ్బందిగా మారింది. హార్డ్ డిస్క్ నుండి సీసీటీవి డేటా ను రికవరీ చేసేందుకు ఐటీ నీపుణుల సహయం తీసుకొంటున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+