46 ఏళ్ల ఆంటీ.. 23 ఏళ్ల యువకుడు.. సీన్ కట్ చేస్తే!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఓ వింత ప్రేమకథ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీహార్ రాష్ట్రానికి చెందిన 46 ఏళ్ల మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో(19 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కుమార్తె) కలిసి బతుకుదెరువు కోసం 2004లో హైదరాబాద్‌కు వలస వచ్చారు. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఈ కుటుంబంలో భర్త వంట మనిషిగా.. సదరు మహిళ ఇళ్లలో పని మనిషిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి సోషల్ మీడియా రూపంలో ఓ యువకుడు ప్రవేశించాడు.
ఇన్‌స్టా పరిచయం.. ప్రేమగా మారింది..
సుమారు నాలుగేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన 23 ఏళ్ల యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈమెకు పరిచయం ఏర్పడింది. వయసులో తన కంటే సగం చిన్నవాడైనప్పటికీ.. వీరిద్దరి మధ్య మాటలు పెరిగి అది కాస్తా ప్రేమకు దారితీసింది. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ రహస్యంగా కలుసుకుంటూ తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

ఇద్దరూ అదృశ్యం
కాగా.. ఆదివారం ఉదయం ఆ మహిళ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ యువకుడితో కలిసి అదృశ్యమైంది. తన భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియక కంగారుపడిన భర్త, చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కనిపించడం లేదని, ఆ యువకుడితో కలిసి వెళ్లిపోయి ఉండవచ్చని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బాధితుడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. సదరు మహిళ ఆ యువకుడి బైక్ వెనుక కూర్చుని నగరం దాటి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ప్రస్తుతం నిందితుడైన యువకుడు, ఆ మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 46 ఏళ్ల వివాహిత, తన పిల్లల వయసున్న యువకుడితో పరారవ్వడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications