Vote From Home: హైదరాబాద్ లో మొదలైన ఓట్ ఫ్రమ్ హోం-ప్రతీ ఓటూ కీలకమయ్యే వేళ..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం ఇంటి నుంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. వయో వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ బూత్ లకు వెళ్లడం కష్టం కాబట్టి సాధారణ ఓటింగ్ జరగక ముందే వీరి ఇళ్లకు వెళ్లి ఓట్లను నమోదు చేయించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ హైదరాబాద్ నుంచి దీన్ని మొదలుపెట్టారు. నగరంలో హోమ్ ఓటింగ్ కోసం పేర్లు నమోదు చేసుకున్న వారి నుంచి ఓట్లను నమోదు చేయిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పించింది. అలాగే దివ్యాంగులకు కూడా ఇంటి నుంచే ఓటు తీసుకుంటున్నారు. ఇలా ఇంటి నుంచే ఓటు వేస్తామంటూ మొత్తం 966 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో 857 మందికే ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో వీరి నుంచి ఓట్లు సేకరించేందుకు అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లారు.

ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయంలో భాగంగా రిటర్నింగ్ అధికారులు వృద్ధ, దివ్యాంగ ఓటర్లకు రెండు తేదీలు సూచిస్తున్నారు. ఇందులో ఏదో ఒక తేదీన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. వారు ముందుగానే సూచించే తేదీన అధికారులు ఈవీఎంలతో వారి ఇళ్లకు వెళ్లి ఓట్లు సేకరిస్తారు. ఇలా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారి ఓట్లను రెగ్యులర్ ఓటింగ్ నుంచి మినహాయిస్తారు.
అలాగే ఇలా ఇంటి నుంచి ఓటు వేస్తున్న వారి వివరాలను రిటర్నింగ్ అధికారులు పోటీలో ఉన్న అభ్యర్ధులకు విధిగా అందిస్తారు. దీంతో పాటు వారు ఓటు వేస్తున్న తేదీని కూడా ఇస్తారు. ఇంటి నుంచే ఓటు వేసే విధానంలో అధికారులు ఇలా దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి అందులోనే ఓ రూమ్ ను ఓటు వేసేలా తయారు చేస్తారు. అందులోనే బ్యాలెట్ విధానంలో వారి ఓట్లు తీసుకుని, దీంతో పాటు ఓటరు ధృవీకరణ పత్రంపైనా సంతకం చేయించుకుని ఈ రెండు పేపర్లను ఓ కవర్ లో ఉంచి ఓటరు ముందే సీల్ వేసి తీసుకెళ్తారు. ఇలా ఓటేసేందుకు 27 వరకూ సమయం ఇచ్చారు. అనంతరం కౌంటింగ్ రోజు ఈ సీళ్లు తీసి లెక్కిస్తారు.












Click it and Unblock the Notifications