'ప్చ్! ఇంకా ఏపీ - తెలంగాణ మధ్య గిల్లికజ్జాలు, కేంద్రమూ కారణం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఇంకా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గిల్లికజ్జాలు కొనసాగుతున్నాయని సిపిఐ సీనియర్ నేత నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం నాడు విలేకరులతో మాట్లాడారు.
రెండు రాష్ట్రాల మధ్య గిల్లికజ్జాలకు కేంద్రం కూడా ఓ కారణమే అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే పదవే ముఖ్యం అన్నట్లుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఉపయోగపడేలా ఆయన తీరు ఉందన్నారు.
ఇక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనీసం విపక్షాలకు అపాయింటుమెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపు: కేటీఆర్
సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ గ్రామజ్యోతి పథకం మన ఊరు - మన ప్రణాళికకు కొనసాగింపని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు ఏం కావాలో ఆ గ్రామాల ప్రజలే నిర్ణయించుకోవాలి కానీ చట్ట సభల్లో ఉండే సభ్యులు కాదన్నారు.












Click it and Unblock the Notifications