రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా: గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల నిలదీత, షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం రాజ్ భవన్‌లో వాగ్వాదం జరిగింది. ఇసుక మాఫియా గురించి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అళీ, సర్వే సత్యనారాయణ తదితరులు రాజ్ భవన్ వెళ్లారు.

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను జైలు నుంచి విడుదల చేయాలని వారు గవర్నర్‌ను కోరారు.

వారికి గవర్నర్ చురకలు

వారికి గవర్నర్ చురకలు

అయితే కొత్త సంవత్సరంలో ప్రభుత్వానికి సహకరించాలని కాంగ్రెస్ నేతలకు ఆయన చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు, మందకృష్ణ అలా చేయాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పారు.

టీ కాంగ్రెస్ ఆగ్రహం

టీ కాంగ్రెస్ ఆగ్రహం

దీంతో కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు షాకిచ్చారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించాలని, రాజకీయ నాయకుడిగా వ్యవహరించవద్దని కాంగ్రెస్ నేతలు అన్నారని తెలుస్తోంది. అంతేకాదు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడిగారని కూడా తెలుస్తోంది.

వీటి కోసం కలిశారు

వీటి కోసం కలిశారు

కాగా, కామారెడ్డి జిల్లాలో ఇసుకాసురులు దారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వీఆర్‌ఏ సాయిలును ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యచేశారు. ఇది సంచలనం రేపింది. మరోవైపు మందకృష్ణ మాదిగను అరెస్టు చేశారు. ఈ అంశాలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
War of words between Governor and Congress leaders at Raj Bhavan on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి